డైరెక్టర్ కార్తీక్ గారు ఒకరోజు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. కథ విన్నాను. చాలా నచ్చింది. శ్రీ విష్ణు గారు. వెన్నెల కిషోర్ గారు, కేతిక గారు ఇలా చాలా అద్భుతమైనటువంటి నటులు ఉన్నారు. గీత ఆర్ట్స్ లాంటి గొప్ప సంస్థ ఉంది. నేను తెలుగులోకి రావడానికి ఇదే యాప్ట్ అనిపించి చేశాను అని హీరోయిన్ ఇవానా అన్నారు.
శ్రీ విష్ణు నటించిన సినిమా #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఇవానా సినిమా విశేషాలు పంచుకున్నారు.
-ఇందులో హరిణి అనే పాత్రలో కనిపిస్తాను. నాది చాలా జోవియల్ అండ్ ప్లజెంట్ క్యారెక్టర్. హరిణి డాన్సర్. తన క్యారెక్టర్ లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంటుంది. తాను ఎవరినైనా ఇష్టపడితే వాళ్లకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. ఈ క్యారెక్టర్ ని ప్లే చేయడం చాలా ఎంజాయ్ చేశాను.
-ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. నా కోయాక్టర్స్ చాలా హెల్ప్ చేశారు. నేను సెట్స్ లో తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించేదాన్ని. తెలుగు బ్యూటిఫుల్ లాంగ్వేజ్.
-ఇది చాలా ఫన్ మూవీ, ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేయొచ్చు. లాఫ్ రైడ్ లా ఉంటుంది. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. కచ్చితంగా చాలా మంచి స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను.ఈ సినిమా నా కెరియర్ లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నా క్యారెక్టర్ డాన్సర్ అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.
-ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ విన్న వెంటనే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఆ ఎక్సైట్ మెంట్ ఆడియన్స్ లో కూడా ఉంటుందని నా నమ్మకం.
నన్ను అందరూ బుజ్జి కన్నా అని పిలుస్తున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. అది లవ్ టు డే సినిమాలో నా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పేరుతో ఆడియన్స్ నన్ను పిలవడం చాలా ఆనంది ఆనందాన్నిచ్చింది. ఒక క్యారెక్టర్ పేరుని గుర్తుపెట్టుకుని పిలవడం కంటే ఒక నటికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. అలా పిలిచిన ప్రతిసారి నేను చాలా ఎంజాయ్ చేస్తాను.
-శ్రీ విష్ణు గారు చాలా కూల్ పర్సన్ . ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. కాస్త ఇంట్రో వర్ట్ అనిపిస్తారు. కానీ కిషోర్ గారితో కలిసినప్పుడు మాత్రం చాలా హిలేరియస్ గా ఉంటారు. శ్రీ విష్ణు గారు నాకు డైలాగ్స్ రాసి ఇవ్వడం వెరీ మెమరీబల్ ఎక్స్పీరియన్స్ . అలాగే కేతిక శర్మ గారితో కూడా వర్క్ చేయడం వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్.
-సినిమాలో చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మిగిలిన పాటలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతున్నాయి. మ్యూజిక్ కి ఈ సినిమాలో చాలా స్పెషల్ ప్లేస్ ఉంది.
- ఇందులో హరిణి డాన్సర్. నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో తన క్యారెక్టర్ డాన్స్ అని తెలిసిన తర్వాత మళ్లీ డాన్స్ క్లాసెస్ కి వెళ్లి ప్రాక్టీస్ చేశాను నేను భరతనాట్యం నేర్చుకున్నాను.
-ప్రత్యేకంగా ఏమీ లేదు. నేను చెల్లిగా, ప్రియురాలిగా ఇలాంటి పాత్రలు చేశాను. రాబోయే సినిమాల్లో కూడా జీవితానికి సంబంధించి పాత్రలు, రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఉండే క్యారెక్టర్స్ చేయాలని ఉంది.
- నేను బాలనటిగా చేశా. అయితే సినిమాలని సీరియస్ గా తీసుకున్నది మాత్రం లవ్ టుడే తర్వాతే. చదువు ముందుగా పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు కూడా మాస్టర్స్ చేస్తున్నాను.