Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట.. కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట. దీంతో ఆమెకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తన వదిన పల్లవిని వేధింపులకు గురి చేసిన కేసులో కోర్టుకు హా

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (06:49 IST)
భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట. దీంతో ఆమెకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తన వదిన పల్లవిని వేధింపులకు గురి చేసిన కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. 
 
రంభ సోదరుడు శ్రీనివాసరావుకు 1999లో పల్లవితో వివాహం కాగా, తనను భర్త, అత్తమామలు, ఆడపడుచు రంభ వేధించారని 2014 జూలైలో పల్లవి మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో వీరు ముగ్గురిపై ఐపీసీ 498 (ఏ) కింద కేసు నమోదైంది. 
 
అప్పటి నుంచి రంభకు ఎప్పుడు సమన్లు ఇవ్వాలని చూసినా, ఆమె అమెరికాలో ఉంటుండటంతో వీలు కాలేదు. ఇటీవల ఓ టీవీ చానల్ రియాల్టీ షో కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు, పద్మాలయా స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చి సమన్లు అందించారు. వెంటనే న్యాయస్థానానికి రావాలని ఆదేశించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత?

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments