Webdunia - Bharat's app for daily news and videos

Install App

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దేవీ
శుక్రవారం, 16 మే 2025 (13:15 IST)
NTR, Hrithik Roshan
హృతిక్ రోషన్‌, ఎన్.టి.ఆర్. కాంబినేషన్ లో రాబోతున్న వార్ 2 సినిమా గురించి ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో పెద్ద క్రేజ్ వుంది. షూటింగ్ పూర్తవుతున్నా కొత్త అప్ డేట్ రాలేదు. దానికి ఫుల్ స్టాఫ్ పెడుతూ హృతిక్ రోషన్‌ తాజాగా ఎన్.టి.ఆర్. గురించి ట్వీట్ చేశాడు. ఈ సంవత్సరం మే 20న ఏమి ఆశించాలో మీకు తెలుసా? నన్ను నమ్మండి, మీకు ఏమి ఎంత అందుబాటులో ఉందో తెలియదు. సిద్ధంగా ఉన్నారా? అంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.
 
ఇప్పటికే ఎన్.టి.ఆర్. అభిమానులు గచ్చిబౌలిలోని పలు సెంటర్లలో ఆటోలలో వార్ 2 పోస్టర్లతో ఇన్ డైరెక్ట్ గా ప్రచారం చేయడం విశేషం. వార్ 2  ఆగ‌స్ట్‌లో  విడుదలకాబోతోంది.  హృతిక్ రోషన్‌ చెప్పినదాన్ని బట్టి ఎన్.టి.ఆర్. పుట్టినరోజైన మే 20న పెద్ద అప్ డేట్ రాబోతోంది. కొత్త లుక్ కూడా రానున్నదని తెలుస్తోంది.  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో నటించిన విధానం తనను బాగా ఆకట్టుకుందని ఓ సందర్భంగా హృతిక్ రోషన్‌ వెల్లడించారుకూడా. డ్యాన్స్, ఫైట్స్ ను కూడా అప్పట్లో మెచ్చుకున్నారు.
 
కనుక ఎన్.టి.ఆర్. ఫస్ట్‌ లుక్ విషయమై చాలా ఆసక్తి ఉంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర‌ దినోత్సవం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. వార్‌ 2 సినిమాలో హృతిక్‌ రోషన్ హీరోగా నటించగా, ఎన్టీఆర్‌ విలన్‌ రోల్‌లో కనిపించబోతున్నాడనే టాక్ న‌డుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఇంకా మూడు రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments