Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదానికి దారితీస్తున్న కంగనా - హృతిక్ రోషన్ హాట్ పిక్చర్!

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (15:59 IST)
హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లీగల్ వివాదం రోజురోజుకూ పెద్దదైపోతోంది. హృతిక్-కంగన 'ఎఫైర్'కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు హాట్ లవర్స్‌గా ముద్రపడిన వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై అనేక రహస్యాలెన్నో వెలుగుచూస్తున్నాయి. ఈ వివాదంలో మొదటి నుంచి హృతిక్ ఒకటే మాట చెప్తున్నాడు. తనకు కంగనతో వృత్తిపరమైన సంబంధమే కానీ, వ్యక్తిగత సంబంధం లేదని, అలాంటి ఉద్దేశంతో ప్రవర్తించలేదని మొదటి నుండి వాదిస్తున్నాడు. హృతిక్ ఆ మాట అన్నాడో లేదో వీరిద్ద‌రు చాలా స‌న్నిహితంగా దిగిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఫొటోలు చూసిన వారు వీరి మ‌ధ్య డేటింగ్ ఉండేఉంటుందని గుస‌గుస‌లాడుకుంటున్నారు. 
 
కంగ‌న‌కు లాయ‌ర్ ద్వారా నోటీసులు ఇచ్చిన హృతిక్ తాను కంగ‌న కేవ‌లం రెండు సినిమాల్లో మాత్ర‌మే క‌లిసి న‌టించామ‌ని త‌మ మ‌ధ్య వృత్తిప‌ర‌మైన సంబంధం మిన‌హా ఇత‌ర‌త్రా సంబంధాలేమి లేవ‌ని స్ప‌ష్టంచేశాడు. అయితే, కంగన మాత్రం తమ డేటింగ్‌ సంబంధించి గట్టి ఆధారాలు ఉన్నాయని మండిపడుతోంది. కంగనా కొన్నాళ్ళ క్రితం తనకు తన న్యూడ్ ఫోటోలు పంపి మనం ఏకాంతంగా కలుసుకున్నప్పుడు నువ్వు నన్ను ఈ రూపంలో చూడొచ్చు అంటూ మెసేజ్‌లు పంపిందని అందరికీ షాక్ ఇచ్చాడు హృతిక్. దీనికి కంగనా నుండి షాకింగ్ సమాధానం కూడా వచ్చింది ఇప్పుడు. 
 
''కైట్స్'' సినిమా షూటింగ్ సమయంలో ఓ ప్రైవేట్ పార్టీలో ఇలా తను నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడని, తనే ముందు నా వెంటపడ్డాడని చెప్పడానికి ఈ ఫోటోనే సాక్ష్యం అని అమ్మడు బహిర్గతం చేసింది. ఆ పార్టీలో తను నాతో బాగా క్లోజ్‌గా మూవ్ అయ్యాడని కానీ ఇప్పుడు మొత్తం మాట మార్చి నేనే అతని వెంటపడ్డానని అబద్దం చెబుతున్నాడని తన లాయర్‌తో చెప్పి౦చి౦ది. అసలు కంగనతో తనకు వ్యక్తిగతంగా ఏ సంబంధం లేదంటున్న హృతిక్‌.. ఈ ఫొటోలో ఏం చేస్తున్నట్టు అని విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ వివాదం ఇంకెన్ని స‌రికొత్త మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments