అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

ఠాగూర్
గురువారం, 7 ఆగస్టు 2025 (16:48 IST)
అధిక బరువును తగ్గించుకునేందుకు తాను ఎలాంటి ఇంజెక్షన్లు వాడలేదని ప్రముఖ సినీ నటి ఖుష్బూ వెల్లడించారు. 54 యేళ్ల వయసులో ఏకంగా 20 కిలోల బరువు తగ్గి నాజూగ్గా మారారు. అయితే, ఆమె బరువు తగ్గడం వెనుక మౌంజారో వంటి ఖరీదైన ఇంజెన్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆమె స్పందించారు. ఎలాంటి షార్ట్‌కట్స్ లేకుండా, కేవలం కఠోర శ్రమతోనే ఇది సాధ్యమైందన్నారు. 
 
ఇటీవల ఖుష్బూ ఆకుపచ్చ రంగు సీక్విన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఆమె శరీరమార్పుపై ప్రశంసలు కురిపించారు. ఇదే క్రమంలో ఓ నెటిజన్, "ఇదంతా మౌంజారో ఇంజెక్షన్ మహిమ. ఈ విషయం మీ ఫాలోవర్లకు కూడా చెప్పండి. వాళ్లు కూడా తీసుకుంటారు" అని కామెంట్ చేశారు. 
 
దీనిపై ఘాటుగా స్పందించిన ఖుష్బూ, తన బరువు తగ్గడం వెనుక ఎలాంటి మందులు గానీ, ఇంజెక్షన్లు గానీ లేవని తేల్చిచెప్పారు. క్రమశిక్షణ, నిలకడ, సంకల్పంతోనే తాను బరువు తగ్గానని, అడ్డదారులను నమ్మవద్దని సూచించారు. తన ఫిట్నెస్ ప్రయాణం గురించి ఖుష్బూ వివరిస్తూ, "ప్రతిరోజూ ఉదయం గంటపాటు వర్కవుట్ చేస్తాను. సాయంత్రం 45-50 నిమిషాలు నడుస్తాను. ఒకవేళ సాయంత్రం నడక కుదరకపోతే, ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున వర్కవుట్ చేస్తాను" అని తెలిపారు. సరైన ఆహార నియమాలు పాటించడం కూడా తన విజయానికి ఒక కారణమని ఆమె పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చనిపోయిన మహిళలో తిరిగి రక్తప్రసరణ ప్రారంభించిన ద్యులు...

ముసలిమడుగులో కుంకీ ఏనుగుల కేంద్రం.. ప్రారంభించిన పవన్

భారత్ పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది డోనాల్డ్ ట్రంపే : పాక్ ప్రధాని

రికార్డు సృష్టించిన జెఫ్ బెజోస్ మాజీ భార్య : రూ.1.70 లక్షల కోట్ల విరాళం

బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments