Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ డీమాంటీ కాలనీ 2

డీవీ
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (14:03 IST)
Demonti Colony 2 release poster
బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ "డీమాంటీ కాలనీ 2" ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి రాజ్ వర్మ ఎంటర్ టైన్ మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ నిర్మిస్తున్నాయి. విజయ సుబ్రహ్మణ్యం, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మాతలు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించారు. 
 
"డీమాంటీ కాలనీ 2" సినిమా ఈ నెల 15న తమిళంలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. "తంగలాన్" వంటి పెద్ద సినిమాతో రిలీజై  బాక్సాఫీస్ వద్ద పోటీని తట్టుకుని ప్రేక్షకాదరణ పొందుతోంది. "డీమాంటీ కాలనీ 2" తెలుగులో ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హరర్ థ్రిల్లర్స్ ను బాగా ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఘన విజయాన్ని అందిస్తారని మూవీ టీమ్ ఆశిస్తోంది. ఇప్పటికే తెలుగులో రిలీజైన "డీమాంటీ కాలనీ 2" ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లోనూ ఇదే రిజల్ట్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మేకర్స్.
 
నటీనటులు - అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments