Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్లు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేష్ ఎంతో తెలుసా?

సాధారణంగా సినీ హీరో లేదా హీరోయిన్‌కు అయినా సరే ఒకే ఒక్క హిట్ పడితే చాలు.. వారు తమ రెన్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తుంటారు. ఈ విషయంలో హీరోయిన్లు ఒక అడుగు ముందుంటారు. ముఖ్యంగా, ఉత్తరాది భామల సంగతి ప్రత్యే

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:38 IST)
సాధారణంగా సినీ హీరో లేదా హీరోయిన్‌కు అయినా సరే ఒకే ఒక్క హిట్ పడితే చాలు.. వారు తమ రెన్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తుంటారు. ఈ విషయంలో హీరోయిన్లు ఒక అడుగు ముందుంటారు. ముఖ్యంగా, ఉత్తరాది భామల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
ఇలాంటివారిలో పూజా హెగ్డే ఒకరు. ఈమె రూటే సెపరేటు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఈ అమ్మడు మూడు సినిమాలు చేసింది. ఈ మూడు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా పూజా కోసం దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో, తన నాలుగో సినిమాకు పూజా ఏకంగా రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందట. వారు కూడా ఇంత మొత్తం ఇవ్వడానికి ఓకే చెప్పేశారు. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సాక్ష్యం' మూవీలో పూజా నటిస్తోంది. 
 
ఇకపోతే, మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ రూ.85 లక్షలు, ఫిదా భామ సాయి పల్లవి రూ.85 లక్షలు, నివేదా థామస్ రూ.70 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ రూ.60 లక్షలు, అనూ ఇమ్మాన్యుయేల్ రూ.50 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారట. 
 
అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటిస్తున్న కైరా అద్వానీ తన రెండో సినిమాను మెగా ఫ్యామిలీ హీరో రాంచరణ్‌తో చేయనుందట. ఈ సినిమా కోసం ఆమె రూ.70 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం దర్శకనిర్మాతలు సై అంటుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments