Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు కుక్కతో సినీనటి పరుల్ యాదవ్ వాకింగ్.. వీధికుక్కలు దాడి.. ఆస్పత్రిలో చికిత్స..

కన్నడ సినీ హీరోయిన్ పరుల్‌యాదవ్‌పై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. వీధి కుక్కల దాడిలో పరుల్ తీవ్రంగా గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోన

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (11:35 IST)
కన్నడ సినీ హీరోయిన్ పరుల్‌యాదవ్‌పై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. వీధి కుక్కల దాడిలో పరుల్ తీవ్రంగా గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని జోగేశ్వర్‌రోడ్‌లో సోమవారం సాయంత్రం తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్‌ చేస్తుండగా అక్కడి వీధికుక్కలు ఒక్కసారిగా పరుల్‌యాదవ్‌ పెంపుడు కుక్కపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. దీంతో ఆమె తన పెంపుడు కుక్కను రక్షించే క్రమంలో వీధికుక్కలను తరిమేందుకు ప్రయత్నించింది. 
 
ఈ క్రమంలో వీధికుక్కలు పరుల్‌పై దాడికి పాల్పడడంతో ఆమె తల, చేతులు, కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి. గమనించిన పరుల్‌ యాదవ్‌ చెల్లెలు శీతల్‌ పరుల్‌తోపాటు స్థానికులు అక్కడకు చేరుకుని కుక్కల బారి నుంచి పరుల్‌ను రక్షించి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మోడల్ కమ్ నటీమణిగా అవతారం ఎత్తిన పరుల్ యాదవ్.. 2004లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళం, కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన ఈమె ఫిల్మ్‌ఫేర్ అవార్డును, ఉత్తమ నటి అవార్డులను సొంతం చేసుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

జల్ జీవన్ మిషన్ కింద రూ.4,000 కోట్లు దుర్వినియోగం.. పవన్ కళ్యాణ్

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments