Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో శ్రీకాంత్ తాజా చిత్రం 'రా.. రా...' : ఏప్రిల్‌లో రిలీజ్

హీర్ శ్రీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం పేరు "రా.. రా". ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక గత రాత్రి నరసారావు పేటలో జరిగింది. శ్రీకాంత్ కథానాయకునిగా 'రా..రా...' పేరుతో రూపొందుతున్న ఈ నూతన చిత్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (15:29 IST)
హీర్ శ్రీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం పేరు "రా.. రా". ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక గత రాత్రి  నరసారావు పేటలో జరిగింది. శ్రీకాంత్ కథానాయకునిగా 'రా..రా...' పేరుతో రూపొందుతున్న ఈ నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించిన విషయం విదితమే. 
 
ద్వితీయ ప్రచార చిత్రం, చిత్రంలోని ఓ గీతాన్ని నరసారావు పేటలోని శ్రీమిత్ర జూనియర్ కాలేజీలో విద్యార్థిని, విద్యార్థుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డీఐజీ జె.సత్యన్నారాయణ రావు, ప్రముఖ కథానాయిక కేథరిన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు కళాశాలలో ఉన్నత ర్యాంక్ సాధించిన విద్యార్థిని విద్యార్థుల చేతుల మీదుగా 'రా.. రా...' ద్వితీయ ప్రచార చిత్రం మరియు చిత్రం లోని ఓ గీతం విడుదల అయింది. 
 
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ 'ఇది హాస్యంతో కూడిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నట్టు చెప్పారు. 
 
'రారా' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రంను  విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments