భజన చేసి అవార్డులు తీసుకుంటున్నారు: హీరో శివాజీ

ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది అవార్డులపై తాజాగా సినీ హీరో శివాజీ స్పందించారు. తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగ

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (10:17 IST)
ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది అవార్డులపై తాజాగా సినీ హీరో శివాజీ స్పందించారు.  తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. టీడీపీకి చెందిన వారికే అవార్డులు ఇవ్వ‌డం న్యాయం కాదని మండిప‌డ్డారు. తనకు ఇలాగే గతంలో అన్యాయం జరిగిందన్నారు.
 
గ‌తంలో తాను న‌టించిన‌ మిస్స‌మ్మ సినిమా బాగా ఆడింద‌ని, అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంద‌ని కానీ అవార్డు రాలేదన్నారు. మిస్స‌మ్మ సినిమాకు త‌న‌కు ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ఇవ్వాల‌ని 90 శాతం మంది క‌మిటీ స‌భ్యులు ఎంపిక చేస్తే కొంద‌రు అడ్డుకున్నారని, త‌న‌కు ఈ విష‌యంపై ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని గుర్తు  చేశారు. 
 
సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భ‌జ‌న చేసి అవార్డులు తీసుకుంటున్నార‌ని విమర్శలు గుప్పించారు. అవార్డులు ఇవ్వాలంటే ఓ కమిటీ వేసి.. ప్రజల అభిప్రాయం సేకరించాకే అవార్డులు ఇవ్వాలని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments