Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ దేశాయ్ పాత్ర టైగర్‌కు ఎంతో కీలకం : హీరో రవితేజ

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (10:15 IST)
టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో రేణూ దేశాయ్ పాత్ర ఎంతో కీలకమని ఆ చిత్ర హీరో రవిజేత అన్నారు. ఈ నెల 20వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో రవితేజ మాట్లాడుతూ, రేణూ దేశాయ్ గారు ఈ చిత్రం ద్వారా చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇవ్వడం చాలా అనందంగా ఉంది. ఆమె నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండే పాత్ర. ఆ పాత్రకి ఆమె చాలా కరెక్టుగా సరిపోయారు. ఆమె పాత్ర ఈ చిత్రానిక హైలెట్‌గా నిలిచింది. ఇక నుపుర్, గాయత్రి, అనుకృతిల పాత్రలు కూడా ఒరిజినల్‌గా ఉన్నవే. అందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్లకి ఇది తొలి చిత్రం అయినప్పటికీ అలా అనిపించరు. డైరెక్టర్ వంశీ గురించి మాత్రం రిలీజ్ తర్వాత మాట్లాడతాను. అన్నారు. 
 
అలాగే, ఈచిత్రంలోని ప్రతి సన్నివేశం చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకు కారణం 'మధి' ఫొటోగ్రఫీ. రామ్ - లక్ష్మణ్ వాళ్లు 'చీరాల'కి చెందినవారే. 'టైగర్ నాగేశ్వరరావు' గురించి వాళ్లకి బాగా తెలుసు. దాంతో ఫైట్స్ గొప్పగా కంపోజ్ చేశారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ట్రైన్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం మరో స్థాయికి తీసుకుని వెళుతుంది. డైలాగ్స్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు అని రవితేజ తన చిత్రం గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఈ నెల 20న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments