Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా పరువు హత్యలేంట్రా జంగిల్ ఫెల్లోస్... హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు

మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృతల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే దీనిపై సాధారణ ప్రజానీకంతో పాటుగా ఎంతోమంది సినీరంగ, రాజకీయరంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రణయ్‌కు నివ

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (11:33 IST)
మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృతల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే దీనిపై సాధారణ ప్రజానీకంతో పాటుగా ఎంతోమంది సినీరంగ, రాజకీయరంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రణయ్‌కు నివాళులు అర్పించడంతో పాటుగా అమృతకు ధైర్యం చెప్పారు. సామాజికమాధ్యమాలు వేదికగా ఎంతోమంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.
 
అలాగే, మంచు మనోజ్ దీనిపై స్పందిస్తూ సమాజంలో పాతుకుపోయిన కులవ్యవస్థను నిర్మూలించాలని లేఖ రాసారు. మనమంతా ఒకే గాలి పీలుస్తున్నాం, ఒకే సమాజంలో జీవిస్తున్నాం, మరెందుకీ వివక్ష? ఈ పెద్ద రోగం నుండి జనాలంతా ఎప్పుడు బయటపడతారు అంటూ తన ఆవేదన వెల్లబుచ్చారు, సింగర్ చిన్మయి కూడా కుల నిర్మూలన జరగాలని, పేర్ల చివర తోకలు చేర్చుకునే సంస్కృతికి వీడ్కోలు పలకాలని చాలా ఘాటుగానే స్పందించారు.
 
ఇక యంగ్ హీరో రామ్ పోతినేని తాజాగా ట్విట్టర్‌లో ఈ ఉదంతంపై ఇలా స్పందించారు. ఇప్పటికే సెక్షన్ 377 కూడా ఎత్తేశారు. ఇంకా కులాలు, మతాలు పట్టుకుని వేలాడడంతో పాటుగా వాటి కోసం హత్యలు చేయడం ఏంటి, మీరేమైనా జంగిల్ ఫెల్లోసా, ముందు మనుషులుగా మారండంటూ హెచ్చరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments