Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితా రాజశేఖర్ కంటతడి పెట్టారు.. ఎందుకో తెలుసా? (వీడియో)

ఒకప్పుడు అంకుశం, మగాడు వంటి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలతో మెప్పించిన హీరో రాజశేఖర్‌. చాలా గ్యాప్ తర్వాత హీరోగా రాజశేఖర్‌ మంచి హిట్ కొట్టారు. అదీ గరుడ వేగ చిత్రం ద్వారా. రెండేళ్ల క్రితం రాజశేఖర్‌

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (15:35 IST)
ఒకప్పుడు అంకుశం, మగాడు వంటి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలతో మెప్పించిన హీరో రాజశేఖర్‌. చాలా గ్యాప్ తర్వాత హీరోగా రాజశేఖర్‌ మంచి హిట్ కొట్టారు. అదీ గరుడ వేగ చిత్రం ద్వారా. రెండేళ్ల క్రితం రాజశేఖర్‌ నటించిన 'గడ్డం గ్యాంగ్‌' ప్లాప్‌ అయిన తర్వాత.. రాజశేఖర్‌ హీరోగా నటించిన చిత్రమిది. చందమామ కథలు, గుంటూరు టాకీస్‌ చిత్రాల దర్శకుడిగా తనెంటో ప్రూవ్‌ చేసుకున్న ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో  హైద‌రాబాద్‌లో గ‌రుడవేగ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల‌న్నీ ప్రేక్ష‌కుల‌తో నిండిపోయాయి. థియేట‌ర్ల ముందు రాజ‌శేఖ‌ర్ అభిమానులు ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. నగరంలోని ఓ థియేట‌ర్‌కు వెళ్లి ప్రేక్ష‌కుల‌తో ముచ్చ‌టించిన రాజ‌శేఖ‌ర్.. తాను ఓ సాధార‌ణ మ‌నిషిన‌ని డైలాగ్ కొట్టారు. త‌న కొత్త సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
 
అయితే, రాజ‌శేఖ‌ర్ ప‌క్క‌న ఉన్న ఓ అభిమాని రాజశేఖర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. రాజశేఖర్ అసాధారణ మనిషని కొనియాడారు. దీంతో పక్కనే ఉన్న జీవిత రాజ‌శేఖ‌ర్ భావోద్వేగానికి లోనైయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఈ సినిమాను హిట్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌ల‌ు చెప్పుకున్నారు. సోదరుడు మరణించడంతో శోకంలో వున్న జీవిత రాజశేఖర్‌కు గరుడ వేగ హిట్ కొట్టడం, అభిమానుల అభిమానాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments