Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా నితిన్, షాలిని కల్యాణం.. డిజైనర్ దుస్తుల్లో మెరిసిన దంపతులు.. (video)

Webdunia
సోమవారం, 27 జులై 2020 (08:07 IST)
Nithiin
టాలీవుడ్ హీరో నితిన్ వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్‌-షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. పెళ్లికొడుకుగా నితిన్, పెళ్లికూతురిగా షాలిని డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. 
 
భీష్మా సినిమా రిలీజ్ తరువాత వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ, లాక్ డౌన్ కారణంగా వివాహం వాయిదా పడింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో నితిన్ వివాహం రెండుసార్లు వాయిదా వేసుకున్నారు. అయితే, కరోనా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేకపోవటంతో ఈ వివాహ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇకపోతే, నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం రంగ్‌ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తీ సురేష్‌ కథానాయిక. నితిన్‌ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్‌ మ్యారేజ్‌ గిఫ్ట్‌ టు అవర్‌ హీరో’ అంటూ ‘రంగ్‌ దే’ టీమ్‌ టీజర్‌ని విడుదల చేసింది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం (వెంకట్‌).

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టేఫ్రీ- మెన్స్ట్రుపీడియా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ, 10 లక్షలకు పైగా బాలికలకు అవగాహన

Pawan Kalyan Meets Chandrababu: బాబుతో పవన్ భేటీ.. వైఎస్సార్ పేరు తొలగింపు

AP Assembly Photo Shoot: పవన్ గారూ ఫ్రెష్‌గా వున్నారు.. ఫోటో షూట్‌కు హాజరుకండి: ఆర్ఆర్ఆర్ (video)

Roja: తప్పు మీది కాదు.. ఈవీఎంలదే.. కూటమి సర్కారుపై సెటైర్లు విసిరిన ఆర్కే రోజా

కాలేజీ ప్రొఫెసర్ కాదు కామాంధుడు.. విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించి.. పోలీసులకు చిక్కాడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments