Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలతో చెలగాటం : శ్రీరెడ్డి ట్వీట్‌పై నాని వైఫ్ కౌంటర్

తన భర్త గురించి నటి శ్రీరెడ్డి చేసిన ట్వీట్లపై హీరో నాని భార్య అంజన కౌంటర్ ఇచ్చింది. పబ్లిసిటీ కోసం మరొకరి జీవితంతో చెలగాటం ఆడుతున్నారనీ, అలాంటి వారి గురించి అస్సలు పట్టించుకోవద్దంటూ ఆమె వ్యాఖ్యానించా

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (09:06 IST)
తన భర్త గురించి నటి శ్రీరెడ్డి చేసిన ట్వీట్లపై హీరో నాని భార్య అంజన కౌంటర్ ఇచ్చింది. పబ్లిసిటీ కోసం మరొకరి జీవితంతో చెలగాటం ఆడుతున్నారనీ, అలాంటి వారి గురించి అస్సలు పట్టించుకోవద్దంటూ ఆమె వ్యాఖ్యానించారు.
 
కాగా, క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారి మీడియా దృష్టిని ఆకర్షించిన శ్రీరెడ్డి.. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోలపై లేనిపోని విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆమె పేరు మీడియాలో బాగా పాపులర్ అయింది. ఈనేపథ్యంలో హీరో నానిని లక్ష్యంగా చేసుకుని రీసెంట్‌గా వరుస పోస్టులు పెట్టింది. 
 
దీంతో తనను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్న‌ట్టు నాని తెలిపాడు. త‌న ట్విట్ట‌ర్‌లోను భావోద్వేగ ట్వీట్ చేశాడు. సున్నితంగా క‌నిపించే వారిపై ఇలాంటి నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌దు. ఇది న‌న్ను క‌లిచివేసింది. ప‌రువు న‌ష్టం కేసు వేస్తూ లీగ‌ల్ నోటీసులు ఇచ్చాను. నేను నా గురించి బాధ‌ప‌డ‌ను. కాని స‌మాజం గురించి బాధ‌ప‌డుతున్నాను. నాపై చేస్తున్న ఆరోప‌ణ‌లు కొంద‌రు క్లిక్‌ల కోసం ప్ర‌చురిస్తున్నారు. వారికి కూడా కుటుంబాలు ఉంటాయి క‌దా అని నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిప్రాయ‌ప‌డ్డాడు. 
 
అలాగే, ఇపుడు ఆయన భార్య అంజన కూడా స్పందించింది. నాని చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ ఈ ఇష్యూపై అంజ‌నా త‌న అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్‌లో వెల్లడించింది. "సినీ ఇండ‌స్ట్రీ చాలా ద‌యాగుణంతో ఉంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం వేరొక‌రి జీవితాల‌తో ఆడుకుంటున్న కొంద‌రు కూడా అందులోకి చేరుతుండ‌టం నన్ను ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే వారు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాలు ఎవ‌రు ప‌ట్టించుకోర‌నుకోండి. కాని త‌మ వ్య‌క్తిగ‌త జీవితాన్ని దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవడానికి వారు ఎలా సిద్ధ‌ప‌డుతున్నారో" అంటూ అంజ‌న త‌న ట్వీట్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments