తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (19:24 IST)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
కాగా, తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును అందుకునేందుకు తన కుటుంబ సభ్యులతో వెళ్లిన నందమూరి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని మాన్ సింగ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని అక్కడ గ్రూపు ఫోటో దిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
మరోవైపు, కోలీవుడ్ అగ్ర నటుడు అజిత్ కుమార్ కూడా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. తాను పద్మ పురస్కారానికి ఎంపికైన సమయంలో అజిత్ తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెల్సిందే. "ఈ శుభవార్త వినేందుకు తన తండ్రి జీవించి వుంటే బాగుందనిపిస్తుంది. ఆయన గర్వపడేవారు" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments