Webdunia - Bharat's app for daily news and videos

Install App

'By gods grace...my dear son is safe' : హీరో మోహన్ బాబు

"ఆ దేవుడి ద‌య‌వ‌ల్ల నా కొడుకు క్షేమంగానే ఉన్నా"డంటూ యువ హీరో మంచు విష్ణు ఆరోగ్యం‌పై ఆయన తండ్రి, హీరో, కలెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు. మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'ఆచారి అమెరికాయాత్ర'

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (17:34 IST)
"ఆ దేవుడి ద‌య‌వ‌ల్ల నా కొడుకు క్షేమంగానే ఉన్నా"డంటూ యువ హీరో మంచు విష్ణు ఆరోగ్యం‌పై ఆయన తండ్రి, హీరో, కలెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు. మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'ఆచారి అమెరికాయాత్ర' సినిమా షూటింగ్‌లో విష్ణు బైక్‌పై నుంచి కింద ప‌డ‌టంతో ఆయ‌న మెడ‌, భుజానికి గాయాల‌య్యాయి. దీంతో షూటింగ్ జ‌రుగుతున్న మ‌లేషియాలోనే ఆయ‌న‌కు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. 
 
విష్ణును ఐసీయులో ఉంచి వైద్యం చేస్తున్నట్టు వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మోహన్ బాబు పై విధంగా ట్వీట్ చేశారు. దీంతో మంచు ఫ్యామిలీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, షూటింగ్ సందర్భంగా బైక్ ఛేజింగ్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొట్టడంతో మంచు విష్ణు బైక్ పై నుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్రగాయాలయ్యాయి. ఆ వెంటనే ఆయనను మలేషియాలోని పుత్రజయ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. 
 
ఈ ప్రమాదంలో మంచు విష్ణు భజం ఎముక ఫ్రాక్చర్ కాగా, మెడ భాగంలో కూడా తీవ్రమైన దెబ్బ తగినట్టు సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను మరొక ఆసుపత్రికి మార్చనున్నారు. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని, ఆయన త్వరలోనే కోలుకుంటారని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆయన కోలుకునే వరకు షూటింగ్‌కు విరామమివ్వనున్నట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments