Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాజిక్ మాస్ట్రో ఇళయరాజాను తలపిస్తున్న హీరో ధనుష్!!

ఠాగూర్
శుక్రవారం, 22 మార్చి 2024 (08:16 IST)
సంగీత మేధావి "ఇళయరాజా" జీవిత చరిత్ర ఆధారంగా "ఇళయరాజా" పేరుతోనే ఒక బయోపిక్ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం గత బుధవారం చెన్నైలో జరిగింది. ఇందులో విశ్వనటుడు కమల్ హాసన్ పాల్గొని, ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఇళయరాజాగా హీరో ధనుష్ నటిస్తున్నారు. తాజాగా ఆయన మేకోవర్‌కు సంబంధించిన ఓ ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ధనుష్ దాదాపు ఇళయరాజాను తలపించేలా ఉన్నారు. 
 
అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యురీ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కనుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడుతో పాటు ఇందులో నటించే నటీనటుల పేర్లను వెల్లడించాల్సివుంది. మరోవైపు, ధనుష్ - అరుణ్ మాధేశ్వరన్ కాంబినేషన్‌లో ఇటీవలే "కెప్టెన్ మిల్లర్" చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో టాక్ పరంగా, అటు కలెక్షన్లపరంగా నిరాశపరిచిన విషయం తెల్సిందే. 
 
నాకూ, కమల్‌కు విభేదాలు ఉన్నాయని రాసేయకండి.. : రజినీకాంత్ 
 
ఎన్నికల సమయం వేళ మీడియా ఉన్నపుడు నోరు తెరవాలంటే భయంభయంగా ఉందని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన కావేరీ ఆస్పత్రి ఎక్కడ అని అడిగితే.. ఆళ్వార్‌పేటలోని సినీ నటుడు కమల్ హాసన్ ఇంటి పక్కన అని చెప్పారు. ఇపుడు కమల్ హాసన్ ఇల్లు ఎక్కడ అంటే.. ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రి పక్కన అని చెబుతున్నారు. 
 
ఈ మాట సాధారణంగా చెబుతున్నానంతే. మళ్లీ నాకూ, కమల్‌కు విభేదాలున్నాయని రాయకండి. మీడియా వాళ్ల ముందు మాట్లాడాలంటే భయమేస్తుంది. ఈ కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తుంది. అసలే ఎన్నికల సమయం. నేను ఇపుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను" అని సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో తాను అనేక ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నానని, వాటి ఫలితంగానే ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments