Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ తెలుగు హీరో పడక గదికి రప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు... నటి కస్తూరి

గతంలో తమిళ, తెలుగు భాషల్లో బిజీ హీరోయిన్‌‌గా గుర్తింపు పొందిన నటి కస్తూరి. ఈమె సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది. ఇటీవల తన వ్యక్తిగత పనులపై చెన్నైకు వచ్చారు.

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (12:37 IST)
గతంలో తమిళ, తెలుగు భాషల్లో బిజీ హీరోయిన్‌‌గా గుర్తింపు పొందిన నటి కస్తూరి. ఈమె సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది. ఇటీవల తన వ్యక్తిగత పనులపై చెన్నైకు వచ్చారు. ఆ సమయంలో ఆమె ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ తన వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించింది. 
 
గతంలో ఓ తెలుగు హీరో తనను పడక గదికి రప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. అయితే ఆ హీరోకు తాను లొంగలేదని చెప్పింది. దాంతో ఆ హీరో తనను వేధించేవాడని, తర్వాతి రెండు సినిమాల నుంచి తనను తప్పించాడని తెలిపింది. ఆ హీరోకు అహంకారం బాగా ఎక్కువని, నిజ జీవితంలో కూడా ‘నో’ అని వినడం ఆయనకు నచ్చదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ హీరో రాజకీయాల్లో కూడా ఉన్నాడని, కానీ ఆయన పేరు మాత్రం వెల్లడించలేని చెప్పుకొచ్చింది.  
 
ఇదిలావుండగా, ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో తెరవెనుక జరిగే అనేక విషయాలను, తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను హీరోయిన్లు బాహాటంగా బహిర్గతం చేస్తున్నారు. ఇలాంటివారిలో హీరోయిన్లు రాధికా ఆప్టే, అర్చన, మాధవీలత, శృతి, రెజీనా, కంగనా రనౌత్, వరలక్ష్మి తదితరులు ఉన్నారు. ఇపుడు కస్తూరి కూడా చేరింది. కాగా, కస్తూరి గతంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం