Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (09:57 IST)
హీరో, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. 
 
తన ప్రచార వాహనం టాప్‌పై నిలబడి కార్యకర్తలకు, పార్టీ నేతలకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారిగా ముందుకు పోనివ్వడంతో ఆయన వెనక్కి వరిగిపోయారు. పక్కనే ఉన్నవాళ్లు పట్టుకోవడంతో బాలయ్యకు ప్రమాదం తప్పింది. లేచి నిలబడిన వెంటనే తన పక్కనే ఉన్న వారిని బాలయ్య పరామర్శించడం గమనార్హం. 
 
'అక్కినేని - తొక్కినేని' వ్యాఖ్యలపై వివరణ
ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావును ఉద్దేశించి "అక్కినేని.. తొక్కినేని" అంటూ వ్యాఖ్యానించారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు స్పందించారు. దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్‌లు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలని వారిని అవమానిస్తే మనల్ని మనం అవమానించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. తాజాగా ఎస్వీ రంగారావు కుమారులు కూడా స్పందించారు. దీంతో నందమూరి బాలకృష్ణ స్పందించక తప్పలేదు. 
 
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏదో ఫ్లోలో అనేశానని చెప్పారు. ఈ మాటలను రాద్ధాంతం చేస్తున్నారని, ఇది విచారించదగ్గ విషయమన్నారు. అక్కినేని నాగేశ్వర రావుగారిని తాను బాబాయ్‌గా భావిస్తానని చెప్పారు. 
 
ఆయన పిల్లల కంటే తనను ఆయన ఎక్కువ ప్రేమగాను, ఇష్టంగా చూసుకునేవారు, ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు. ఇక్కడ ఉంది అని బాలయ్య వెల్లడించారు. బాబాయ్ పట్ల నా గుండెల్లో ప్రేమ ఉంది. బయట ఏవో అంటుంటారు. అవన్నీ నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు. 
 
ఎన్టీఆర్, ఎన్నార్‌లను అభిమానంతో ఎలా పిలుస్తారో తెలిసిందే కదా. రామారావును అభిమానంతో ఎన్టీవోడు అంటారు. ఎఎన్నార్‌ను నాగిగాడు అంటారా లేదా? అభిమానంతో అలా అంటారు. నేను ప్రచారానికి వెళ్లినపుడు నాకు కూడా ఇలాంటి మాటలు ఎదురవుతుంటాయి వాళ్ల యాసలో ఏదో ఒక పదం జోడించి.. వెళ్లిపోతున్నాడ్రా అని అంటారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments