Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైకి రావాలంటే 'యు షుడ్ స్లీప్ విత్ మి' అన్నాడు...: ఫిదా గాయత్రి గుప్త (వీడియో)

'ఫిదా' సినిమాలో సాయిపల్లవికి స్నేహితురాలిగా నటించిన గాయత్రి తాను సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నోరు విప్పింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకేకాకుండా టాలీవుడ్‌లోనూ నిర్మాతలు హీరోయిన

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (14:53 IST)
'ఫిదా' సినిమాలో సాయిపల్లవికి స్నేహితురాలిగా నటించిన గాయత్రి తాను సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నోరు విప్పింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకేకాకుండా టాలీవుడ్‌లోనూ నిర్మాతలు హీరోయిన్లపై కన్నేస్తారని వారిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తారనేందుకు గాయత్రీ పంచుకున్న అనుభవాలే నిదర్శనం. సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎదురైన పరిస్థితే తనకు వచ్చిందని తెలిపింది. 
 
రెండేళ్ల క్రితం తను ఓ సినిమా ఒప్పుకున్నానని.. తనను వాడుకునే ఆలోచనలుంటే ముందే చెప్పేయండి.. అలాంటివి వుంటే తను చేయనని తెగేసి చెప్పినట్లు తెలిపింది. అందుకు సదరు నిర్మాతలు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు.. తాము ప్రాస్టిట్యూషన్ నడపట్లేదు. ప్రాజెక్టు మాత్రమే చేయబోతున్నామని.. ఆరిస్టులను గౌరవిస్తామని చెప్పారు. దీంతో ఆ ప్రాజెక్టు చేసేందుకు తను ఒప్పుకున్నానని గాయత్రీ వెల్లడించింది. 
 
అయితే షూటింగ్ ప్రారంభం అయ్యాక దర్శకుడు, నిర్మాత వేధింపులు మొదలెట్టారు. ముందే చెప్పానుగా నాకు ఇలాంటివి నచ్చవని అంటే కెరీర్ గుర్తు చేశారని తెలిపింది. తనకు అహంకారం వుందని.. ఇలాగైతే కెరీర్ కష్టమేనని దర్శకులు, నిర్మాత అంటే ఇది అహం కాదని, ఆత్మగౌరవమని చెప్పానంది. తన ఫోటో చూసి ఎందరో ఆఫర్స్ చేశారు. అంగీకరించివుంటే ఈపాటకి కోట్లు సంపాదించేదానివని అన్నారు. ఒక రాత్రికి కోట్లిస్తామన్నా తాను ఒప్పుకోలేదు. డబ్బులు సంపాదించడం తన ఉద్దేశం కాదని ఖచ్చితంగా చెప్పేశాను. 
 
కానీ ఓ రోజు ఆ చిత్ర నిర్మాత డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. మధ్యలో కారు బ్రేక్ డౌన్ అయ్యిందని చెప్పి, కాసేపు రెస్ట్ తీసుకుందామని ఒక ప్లేస్‌కి తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక మళ్లీ లైంగికంగా వేధించారు. తన డ్రెస్‌ను లాగేస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఎలాగోలా తప్పించుకుని వచ్చేశానని గాయత్రి తెలిపింది. 
 
అప్పటి నుంచి ఆ నిర్మాతకు తాను దూరంగా వున్నాననీ.. ఐతే అతడు తను ఒప్పుకునే ప్రాజెక్టులన్నీ తప్పిస్తున్నాడని.. టాలీవుడ్‌లో ఆయనో బడా నిర్మాతేనని గాయత్రి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. హీరోయిన్‌గా రావాలంటే "యు షుడ్ స్లీప్ విత్ మీ" అన్నారు. ఆయన ఆ మాట అనడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని వెల్లడించింది. ఇలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఇతరులపై ఆధారపడక్కర్లేదని డిసైడ్ అయ్యానని తెలిపారు. వెంటనే తానే కొత్త ప్రాజెక్టు చేపట్టానని గాయత్రి తెలిపింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

Thar: టైర్ కింద నిమ్మకాయ పెట్టి యాక్సిలేటర్ అదిమింది.. కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి..? (video)

చంద్రబాబు బావిలో దూకి చావడం బెటర్: మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

Army: నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి.. అమలులో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం

నేపాల్‌లో చిక్కుకున్న 187మంది- రక్షణ చర్యల కోసం రంగలోకి దిగిన నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం