Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీలైనంత సహాయం చేస్తున్నా, కానీ అర్థరాత్రి ఇబ్బంది పెడుతున్నారు: సోనూసూద్

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (17:20 IST)
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తమకు సాయం కావాలంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని సినీ నటుడు సోనూసూద్ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్యసేవలపై వివిధ రంగాల నిపుణులతో బాబు వర్చువల్‌గా సమావేశమయ్యారు.
 
ఇందులో సోనూసూద్ కూడా పాల్గొన్నారు. తనకు అర్థరాత్రి సమయంలో కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఈ సంధర్భంగా సోనూ సూద్ తెలిపారు. తాను వీలైనంత సాయం చేస్తున్నానని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సేవ చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. 
 
తన భార్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని ఆమె గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అని సోనూసూద్ వ్యాఖ్యానించారు. తనకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు సెకండ్ హోం వంటివని వ్యాఖ్యానించారు సోనూసూద్. 
 
హైదరాబాద్ అభివృద్థిలో చంద్రబాబునాయుడు పాత్రను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. అప్పట్లో చంద్రబాబు హైదరాబాదులో ఎన్నో అభివృద్థి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ఆ నగర అభివృద్థిలో చంద్రబాబు పాత్ర గొప్పదని చెప్పారు. సోనూసూద్ చేస్తున్న సేవలను కూడా చంద్రబాబు కొనియాడారు. 
 
ఇదంతా చెబుతూ అర్థరాత్రి వేళ కొంతమంది చేసే ఫోన్ల కారణంగా తాను బాగా ఇబ్బందిపడుతున్నానంటున్నాడు. అయితే ఒక్కసారి సాయం చేయాలనే ఆలోచన వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. ప్రస్తుతం సోనూసూద్ తెలుగు సినీపరిశ్రమలో విలన్ కాదు, హీరో అంటూ అభిమానులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments