Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బా పటేల్, పాయల్ నాయిక‌లుగా అలా నిన్ను చేరి

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (17:58 IST)
Dinesh Tej, Hebba Patel, Payal Radhakrishna
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’ . హుషారు సినిమాతో సక్సెస్ కొట్టి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న దినేష్ తేజ్ హీరోగా హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో  గురువారం ఘనంగా జరిగింది . 
 
హీరో హీరోయిన్స్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మాజీ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి టీవీ 5 మూర్తి, హనుమంతరావు, కృష్ణా రావు, గరుడవేగ అంజి, హుషారు ఫేమ్ తేజస్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
దర్శకత్వ బాధ్యతను మాత్రమే కాకుండా కథ, కథనం, మాటలు కూడా మారేష్ శివన్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది.
 
‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనందన్ అందిస్తుండగా.. పి.జి. వింద కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్, క్యాస్టూమ్ డిజైనర్‌గా ముదసరా మహ్మద్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.
 
ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివ రామచంద్రవరపు, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్న
 
కథ, కథనం, మాటలు  దర్శకత్వం  :  మారేష్ శివన్, నిర్మాత :  కొమ్మాలపాటి సాయి సుధాకర్
సమర్ఫణ :  కొమ్మాలపాటి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ :  కర్నాటి రాంబాబు, సంగీతం  : సుభాష్ ఆనందన్, కెమెరా- పి.జి. వింద, పాటలు :  చంద్రబోస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments