Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండించేవాళ్ళు మూతిమీద మీసమంత‌మంది, ఇందుకు శ్రీ‌కారం చుట్టినందుకు హ్యాట్సాప్ః త్రివిక్రమ్

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (19:55 IST)
Srikaram 4ht song function
`శ్రీకారం టైటిల్ సాంగ్ 4వ పాట నా చేతులమీదుగా లాంచ్ అవడం హ్యాపీగా ఉంది. టీజర్ చూశాను. నాకు బాగా నచ్చింది` అని స్టార్ ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ అన్నారు. శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం "శ్రీకారం". ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. కాగా "శ్రీకారం" చిత్రంలోని టైటిల్ సాంగ్ ని మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ లాంఛ్ చేశారు.
 
అనంత‌రం త్రివిక్రమ్ మాట్లాడుతూ.. " 14రీల్స్ రామ్, గోపీ నాకెంతో ఇష్టమైన ప్రొడ్యూసర్స్. వాళ్ళ దూకుడికి ఎప్పుడో శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు కొత్తగా మరో చాప్టర్ స్టార్ట్ చేసి దానికి శ్రీకారం చుడుతున్నారు. మా రాంజోగ‌య్య‌ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలోని మూడు పాటలు చూశాను. చాలా బాగున్నాయి. ఆల్ రెడీ సోషల్ మీడియాలో విపరీతంగా సక్సెస్ అయ్యాయి. స్టోరీ విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వ్యవసాయం చేసేవాళ్ళు నెత్తిమీద జుట్టంత ఉంటే దానిని పండించేవాళ్ళు మూతి మీద మీసం అంత మంది ఉన్నారు.

ఆ డైలాగ్ సూపర్బ్ గా ఉంది. ఈ చిత్రానికి శ్రీకారం అనేది పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్. నాకు తెల్సి  నెక్స్ట్ ప్రపంచానికి బిగ్ థింగ్ వ్యవసాయం. వ్యవసాయం ఎంతో పాతది అయినా దానిమీద ఆధారపడి కొన్నివేల సంవత్సరాల నుండి బ్రతుకుతున్నాం. జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాంటప్పుడు వ్యవసాయం లాభసాటిగా మారాలి. కానీ నష్టాల్లో. కూరుకుపోతుంది. దానికి సొల్యూషన్ చెప్పడానికి దర్శకుడు కిషోర్  శ్రీకారం ద్వారా ప్రయత్నం చేశాడు. ఒక పాత పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు. "అ ఆ"కు  మ్యూజిక్ చేసిన మిక్కీ ఈ చిత్రానికి కూడా వన్డ్రఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు.. అన్నారు.
 
పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "నా అనుభవంలోంచి వచ్చిన పదాలతో టైటిల్ సాంగ్ రాశాను. అది నాకు ఎంతో ఆత్మీయ సన్నిహితుడు త్రివిక్రమ్ లాంఛ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఒక మంచి ఆలోచింపజేసే పాయింట్ తో కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతనికి ఎంతో వెన్నుదన్నుగా నిలబడి సపోర్ట్ చేసిన శర్వానంద్, నిర్మాతలకు అభినందనలు. పాట విని ఎంజాయ్ చేయండి అన్నారు.
 
చిత్ర దర్శకుడు బి. కిషోర్ మాట్లాడుతూ.. " నాలుగేళ్ళ క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. ఇప్పుడు శ్రీకారంతో ఫ్యూచర్ ఫిల్మ్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా శర్వానంద్ అన్నకు, రామ్, గోపీ గారికి కృతజ్ఞతలు. కొత్త డైరెక్టర్ ని అయినా ఎంతో సపోర్ట్ చేస్తూ.. మంచి సినిమా తీశారు. యువరాజ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. అలాగే మిక్కీ ఎక్స్ లెంట్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

పాటలకి అద్భుతమైన స్పందన వస్తోంది. వ్యవసాయంతో పాటు ఒక తండ్రి కొడుకుల మధ్య రిలేషన్, లవ్ ఫెయిల్యూర్, మనకి, మన ఊరికి వచ్చిన చిన్న గ్యాప్ ని ఎలా ఫుల్ ఫిల్ చేయొచ్చో ఈ చిత్రంలో చూపించాం. ఇంకా ప్రతీ ఒక్కరూ ఆలోచింప జేసే విధంగా చాలా విషయాలను శ్రీకారంలో చూపించబోతున్నాం.. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.. అందరూ ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments