Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓం నమో వేంకటేశాయ' సినిమా అసభ్యంగా చిత్రీకరిస్తే కోర్టుకు వెళతా : హథీరాంజీ మఠం మహంతు అర్జున్‌ దాస్‌

'ఓం నమో వేంకటేశాయ' సినిమా చిత్రీకరణ ప్రారంభంకాగానే పెద్ద దుమారం రేపుతోంది. భక్తి "రస" దర్శకుడిగా పేరుగాంచిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు "ఓం నమో వేంకటేశాయ" సినిమాను అసభ్యంగా తీస్తారన్న అనుమానం చాలామ

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (12:34 IST)
'ఓం నమో వేంకటేశాయ' సినిమా చిత్రీకరణ ప్రారంభంకాగానే పెద్ద దుమారం రేపుతోంది. భక్తి "రస" దర్శకుడిగా పేరుగాంచిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు "ఓం నమో వేంకటేశాయ" సినిమాను అసభ్యంగా తీస్తారన్న అనుమానం చాలామంది మఠాధిపతులు, పీఠాధిపతులు, మహంతుల్లో నెలకొంది. ఎప్పుడూ సైలెంట్‌‌గా ఉండే మహంతుకు ఒక్కసారిగా కోపమొచ్చింది. ఆయన మరెవరో కాదు. తిరుపతికి చెందిన హథీరాంజీ మఠం మహంతు అర్జున్‌ దాస్‌. ఈనెల 23వ తేదీన తిరుమలకు 'ఓం నమోవేంకటేశాయ' బృందం వచ్చి దర్శించుకుంది. అప్పటినుంచి అర్జున్‌ దాస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఎప్పుడూ తన సినిమాల్లో పండ్లు, పూలతో అసభ్యంగా చిత్రీకరణలు చేసే దర్శకుడు రాఘవేంద్రరావు. ఈయన 'ఓం నమో వేంకటేశాయ' సినిమాను కూడా అదే విధంగా తీస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'ఓం నమో వేంకటేశాయ' అనే పేరు కోట్లాదిమంది హిందువులు ఎంతో భక్తిభావంతో పూజిస్తారని, అలాంటి పేరుకు రాఘవేంద్రరావు ఎక్కడ చెడ్డపేరు తెస్తారోనన్న అనుమానాన్ని హథీరాంజీ వ్యక్తం చేస్తున్నారు.
 
అంతేకాదు ప్రముఖ సినీనటి అనుష్కకు కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను ఇస్తున్నారని ఆ పాత్ర ఎలాంటిదో వెంటనే తెలియజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అనుష్కను ఈ సినిమాలో అశ్లీలంగా ప్రయత్నం చేస్తున్నట్లు తమకు తెలిసిందని కూడా మహంతు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద సినిమా చిత్రీకరణ సమయంలో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటే వెంటనే హైకోర్టుకు వెళతానన్నారు హథీరాంజీ. అంతేకాదు బాబాను కూడా ఈ సినిమాలో చిత్రీకరిస్తున్నారని, బాబాను కించపరిచేలా సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని అర్జున్ దాస్ మహంతు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments