Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ఇండస్ట్రీ (SPB) బాలుని మరచిపోయిందా..?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (15:05 IST)
గాన గంధర్వుడు బాలు ఇక లేరు అని తెలిసి అందరూ ఎంతగా బాధపడ్డారో తెలిసిందే. ఇప్పటికీ బాలు లేరంటే నమ్మబుద్ధి కావడం లేదు. అయితే... చిత్ర‌సీమ‌లో ఎవ‌రైనా ఓ ప్ర‌ముఖుడు చ‌నిపోతే సంతాప స‌భ పెట్ట‌డం, నివాళి అర్పించ‌డం ప‌రిపాటి. కానీ… బాలు విష‌యంలో అది ఇంతవ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. `క‌రోనా వ‌చ్చిందండీ.. సోష‌ల్ డిస్టెన్సీ ఉండాలండీ` అని క‌బుర్లు చెప్ప‌డానికి ఇప్పుడు వీల్లేదు.
 
ఎందుకంటే... ఎంత క‌రోనా అయినా ప్రైవేటు కార్య‌క్ర‌మాలు బోల్డ‌న్ని జ‌రుగుతున్నాయిప్పుడు. అలాంటప్పుడు బాలు సంతాప సభ పెట్టకపోవడానికి కారణం ఏంటి..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉంటున్నారు. అలాంటప్పుడు అన్నీ తెలిసిన చిరంజీవిగారు కూడా ఎందుకు బాలు సంతాప సభ విషయంలో సైలెంట్‌గా ఉన్నారో అర్థం కావడం లేదు అనే కామెంట్స్ వినపడుతున్నాయి.
 
బాలుతో అందరికీ అనుబంధం ఉంది. అందరి సక్సెస్‌లో బాలు పాత్ర ఉంది. అలాంటప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేది సమాధనం లేని ప్రశ్నగా మారింది అంటున్నారు. బాలు మరణించారనే వార్త తెలిసినప్పుడు.. తెలుగు ఇండస్ట్రీలో వాళ్లు బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
అంతన్నారు ఇంతన్నారు కానీ.. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే.. బాలుపై చూపించింది అంతా నిజమైన ప్రేమ కాదా..? అనిపిస్తుంది. మరి.. తెలుగు ఇండస్ట్రీ సైలెంట్‌గా ఉండటంపై వస్తున్న విమర్శలపై త్వరలోనే తాళం వేస్తారో లేదంటే కొనసాగేట్లు చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments