Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వృద్ధుడు 'కబాలి' స్టామినా రూ.600 కోట్లా...? 60 ఏళ్ల వృద్ధుడు చిరు స్టామినా ఎంతో...?

ఆయన 65 ఏళ్ల వృద్ధుడు. జస్ట్ అలా చేయి తిప్పి వణక్కం అన్నాడో బిగ్ స్క్రీన్ దద్దరిల్లుతుంది. ఆయనే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్. కబాలి చిత్రంతో 65 ఏళ్ల వయసులోనూ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నారు. కబాలి చిత్రం రూ. 600 కోట్లు దాటిపోయిందంటూ ప్రచారం జర

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (14:36 IST)
ఆయన 65 ఏళ్ల వృద్ధుడు. జస్ట్ అలా చేయి తిప్పి వణక్కం అన్నాడో బిగ్ స్క్రీన్ దద్దరిల్లుతుంది. ఆయనే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్. కబాలి చిత్రంతో 65 ఏళ్ల వయసులోనూ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నారు. కబాలి చిత్రం రూ. 600 కోట్లు దాటిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.... చిత్రం విడుదలై 10 రోజులయింది. ఈ 10 రోజుల్లోనే రూ. 600 కోట్లు లాగేసిందని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బాహుబలి రికార్డును కబాలి బద్ధలు కొట్టేసినట్లే. 
 
అంతేకాదు సల్మాన్ ఖాన్ సుల్తాన్ కలెక్షన్లకు దగ్గరకు వస్తున్నట్లే. సుల్తాన్ చిత్రం రూ. 550 కోట్లు వసూలు చేసింది. ఐతే గణాంకాలు వేరే లెక్కలు చెపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కబాలి విడుదలైన థియేటర్లలో అమ్ముడయిన టిక్కెట్ల ప్రకారం కబాలి చిత్రం సుమారుగా రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. మరి 600 కోట్లు అంటూ జరుగుతున్న ప్రచారం వెనుక అసలు కథ ఏమిటో తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే ప్రస్తుతం 150వ చిత్రంలో నటిస్తున్న 60 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవి పైనా ఇప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కబాలి రికార్డును చిరంజీవి క్రాస్ చేస్తారా అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments