Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ నిర్మాత లైంగిక వేధింపుల జాబితాలో ఐష్...

గత కొద్ది రోజులుగా హాలీవుడ్లో మారు మ్రోగిపోతున్న పేరు హార్వే వైన్‌స్టైన్‌. ప్రముఖ ప్రొడ్యూసర్గా ఉన్న ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువ కావడంతో హాలీవుడ్ భగ్గుమంటుంది. ఇప్పటికే యువ హీరోయిన్లు ఒక్కొక

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (09:38 IST)
గత కొద్ది రోజులుగా హాలీవుడ్లో మారు మ్రోగిపోతున్న పేరు హార్వే వైన్‌స్టైన్‌. ప్రముఖ ప్రొడ్యూసర్గా ఉన్న ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువ కావడంతో హాలీవుడ్ భగ్గుమంటుంది. ఇప్పటికే యువ హీరోయిన్లు ఒక్కొక్కరుగా తాము అనుభవించిన ఇబ్బందులను బయటపెడుతున్నారు. అమ్మాయిల జీవితాలని నాశనం చేశాడని ఈయన గురించి రోజుకొక వార్త వెలుగులోకి వస్తుండడంతో ఇది భరించలేని ఆయన భార్య విడాకులు ఇచ్చి వెళ్లిందట. అయితే హార్వే లిస్ట్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా ఉందట. ఈ విషయాన్ని ఐష్ మాజీ మేనేజర్ తాజాగా వెల్లడించారు. 
 
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మాజీ మేనేజర్ సిమోన్ షెఫీల్డ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో హార్వే.. ఐష్ కి ఎలా గాలం వేయాలనుకున్నాడో వివరించింది. ఓ సారి అమెరికాలో నిర్వహించిన ఆంఫార్ గాలాకు ఐష్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి వెళ్లింది. అక్కడ హార్వేతో పరిచయం ఏర్పడగా, ఆయనతో కలిసి ఫోటో కూడా దిగారు ఐష్ దంపతులు. 
 
ఈ నేపథ్యంలో ఐష్‌పై మనసు పారేసుకున్న హార్వే ఓసారి ఐష్‌తో పర్సనల్ మీటింగ్ ఏర్పాటు చేయమని, ఐష్ మేనేజర్ సిమోన్‌ని కోరాడట, కాని తాను అందుకు ససేమీరా అందట. పలు మార్లు బెదిరించినప్పటికి, ఐష్ దరిదాపుల్లో కూడా అతనని రానివ్వలేదు. అతను ఓ పశువులా ప్రవర్తించేవాడు అని సిమోన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం