పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. షూటింగ్ జరుగుతోంది ఈరోజు నిధి అగర్వాల్ రాయల్, గాంభీర్యం, ఆకర్షణ లుక్ తో పవన్ ను చూస్తున్న లుక్ విడుదల చేసారు. ఇది నిధిఅగర్వాల్ మొదటి రోజు షూట్‌లో చిత్రీకరించబడింది. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆమె మొదటి షాట్ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సాంగ్ ఈ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.
జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. ఒక వారియర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం కోసం సుమారు ఐదేళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ ఫైనల్ గా ఇపుడు ఈ సినిమా రిలీజ్ కి వస్తుంది.
నేడు వాలెంటైన్స్ డే కానుకగా చిత్ర టీం రెండో సాంగ్ పై అప్డేట్ ని అందించారు. పవన్, నిధిలపై సాగే డ్యూయెట్ సాంగ్ గా మేకర్స్ ఇద్దరి నడుమ బ్యూటిఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు.ఈ సాంగ్ ఈ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఎం ఎం కీరవాణి సంగీతం అనిదించిన ఈ చిత్రాన్ని నిర్ఈమాతలు మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.