Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ - కేరీర్‌ను మలుపుతిప్పిన 'సింహాద్రి' (video)

Webdunia
బుధవారం, 20 మే 2020 (08:57 IST)
'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా పరిచయమై... తొలి సినిమాతోనే పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ తర్వాత 'స్టూడెంట్ నెంబర్ 1', 'సుబ్బు', 'ఆది' చిత్రాలతో సక్సస్ సాధించి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. 
 
'ఆది' సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేసి చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోగా ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత 'అల్లరి రాముడు', 'నాగ' చిత్రాలతో ఫరవాలేదు అనిపించాయి. కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఎన్టీఆర్‌కు స్టార్ ఇమేజ్ వచ్చింది. 
 
ఇంత తక్కువ వయసులో... ఇంత తక్కువ టైమ్‌లో ఏ హీరో కూడా స్టార్ ఇమేజ్ రాలేదు. 
 
 
అది ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. అయితే.. ఆది సినిమాతో మాస్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నటించిన 'అల్లరి రాముడు', 'నాగ' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో కెరీర్‌లో ఏ తరహా సినిమా చేయాలి..? ప్రేక్షకాభిమానులను ఎలా మెప్పించాలి..? అని ఆలోచిస్తున్న టైమ్‌లో ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే 'సింహాద్రి'. 
 
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా అది. '
 
సింహాద్రి' ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ మైలు రాయి అని చెప్పచ్చు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన భూమిక, అంకిత నటించారు. మాస్ ఆడియన్స్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న ఇమేజ్‌కు తగ్గట్టుగా విభిన్న కథ, కథనంతో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించారు. సెంటిమెంట్, యాక్షన్.. రెండింటినీ సమపాళ్లలో చూపిస్తూ.. తర్వాత సీన్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలిగించే స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని తెరకెక్కించి సంచలన విజయాన్ని సాధించాడు రాజమౌళి. 
 
తను నమ్ముకున్న వాళ్ళ కోసం చంపేదుకైనా, చచ్చేందుకైనా సిద్దపడడం తప్పుకాదనే పాయింట్‌ మీద సినిమా తీశారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు.
 
ఈ సినిమా క్లాసు, మాసు అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ క్రాస్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతో ఎన్టీఆర్, రాజమౌళిల రేంజ్ అమాంతం పెరిగింది. 
 
ఎన్టీఆర్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి 'సింహాద్రి' చరిత్ర సృష్టించింది. సాంబ, అశోక్, రాఖీ, యమదొంగ, కంత్రీ, అదుర్స్, బృందావనం, ఊసరవెల్లి, బాద్ షా... ఇలా విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుని ఎన్టీఆర్ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు.
 
 కెరీర్‌లో అపజయాలు వచ్చినా.. కుంగిపోకుండా కష్టపడ్డాడు. సక్సస్ సాధించాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత.. ఇలా వరుసగా విజయాలు సాధిస్తూ కెరీర్‌లో దూసుకెళుతున్నారు. 
 
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో "ఆర్ఆర్ఆర్" మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. ఇలా... పక్కా ప్లానింగ్‌తో... వరుసగా సక్సస్ సాధిస్తూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ టైగర్.. హ్యాపీ బర్త్ డే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments