Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం - జగం మెచ్చిన దర్శకుడికి బర్త్‌డే విషెస్...

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు వేడుకలు మంగళవారం జరుపుకుంటున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శిష్యుడిగా 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో వెండితెర దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (09:38 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు వేడుకలు మంగళవారం జరుపుకుంటున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శిష్యుడిగా 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో వెండితెర దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేకుండా దూసుకెళుతున్నాడు. మాస్ సినిమాలే కాదు, క్లాస్ సినిమాలతోనూ మెప్పిస్తున్నాడు. 
 
మంచి కథలు తీసుకొని వాటిని సెల్యూలాయిడ్‌పై మనోజ్ఞ దృశ్యకావ్యంగా మలచడంలో జక్కన్న సిద్ధహస్తుడు. 'ఈగ' లాంటి ప్రయోగాతక్మ సినిమాలూ చేసి ప్రేక్షకుల్ని ఒప్పించాడు. రాజమౌళి సినిమాల్లో హీరో ఏదోక ఆయుధాన్ని వాడటం మనం చూశాం. అది జక్కన్న మార్క్ అని చెప్పాలి. అయితే రాజమౌళి సినిమాలకే పరిమితం కాలేదు. టీవీ సీరియల్స్‌లోనూ కూడా తన టాలెంట్ చూపించాడు. 
 
రాజమౌళి చెక్కిన శిల్పం 'బాహుబలి 2' రిలీజై ఇప్పటికే కొన్ని నెలలైంది. రాజమౌళి తర్వాత సినిమా ఏమిటి? అని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం తొందరపడటం లేదు. ప్రస్తుతం బాహుబలి 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తను తీయబోయే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. జనం మెచ్చిన, జగం మెచ్చిన రాజమౌళికి సోషల్ మీడియాలో అభిమానులే కాదు సెలబ్రిటీలు బర్త్ డే శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments