Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానాకు బర్త్ డే గిఫ్ట్.. ఘాజీ, బాహుబలి 2ల్లో రానా లుక్ అదుర్స్.. వెల్లువెత్తుతున్న లైక్స్, షేర్స్

తొలి సినిమాతో లీడర్ అనిపించుకున్న రానాకు డిసెంబర్ 14 పుట్టినరోజు. లీడర్ తర్వాత వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమా కూడా క్లాస్ ఆడియన్స్‌కు నచ్చిన సినిమా. ఇక గత ఏడాది బాహుబలి చిత్రంలో నటించి ఇంటర్నేషనల

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (13:02 IST)
తొలి సినిమాతో లీడర్ అనిపించుకున్న రానాకు డిసెంబర్ 14 పుట్టినరోజు. లీడర్ తర్వాత వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమా కూడా క్లాస్ ఆడియన్స్‌కు నచ్చిన సినిమా. ఇక గత ఏడాది బాహుబలి చిత్రంలో నటించి ఇంటర్నేషనల్ ఫేం తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా నటిస్తున్న బాహుబలి 2 వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. రానా చేస్తున్న మరో మూవీ ఘాజీ కూడా వచ్చే ఏడాదికి ఫిబ్రవరి 17 కి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో రానా పుట్టినరోజును పురస్కరించుకుని బాహుబలి2లో రానా లుక్‌ను విడుదల చేశారు. 
 
ఇకపోతే.. ఘాజీ మూవీలో రానా నావెల్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. రానా బర్త్ డే కానుకగా చిత్రానికి సంబంధించి రానా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ లుక్ లో రానాని చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. రానా కేవలం యాక్టర్ మాత్రమే కాదు నిర్మాత కూడా. 
 
బొమ్మలాట, ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఓ సినిమా తీయగా దానికి అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా బాహుబలి 2లో రానా గెటప్, ఘాజీలో నావెల్ ఆఫీసరుగా రానా లుక్ ఎలా ఉంటుందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రానా న్యూ గెటప్‌లకు సంబంధించిన ఫోటోలను నెటిజన్లు షేర్లు చేస్తున్నారు. లైక్స్ వెల్లువెత్తేలా చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments