Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌లాంటి నాయకుడు ఉండటం ఏపీ ప్రజల అదృష్టం.. అదే ఆయన పవర్: వర్మ

సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అస్సలు పడదు. వర్మ చేసిన కామెంట్స్‌కు పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తుంటారు. ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (16:46 IST)
సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అస్సలు పడదు. వర్మ చేసిన కామెంట్స్‌కు పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తుంటారు. ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ స్టార్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోలికి ఇక వెళ్ళే ప్రసక్తే లేదంటూ వర్మ ట్వీట్ కూడా చేశాడు.

తాను మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ తన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకుంటున్నారని పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి గతంలో వర్మ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఇకపై జీవితంలో పవన్‌కల్యాణ్‌ గురించి ఎలాంటి ట్వీట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. చివరిగా బై.. బై పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. 
 
అయితే సర్దార్ గబ్బర్ సింగ్ సందర్భంలో పవన్ గురించి ట్వీటాడిన వర్మ మళ్లీ సీన్లోకి వచ్చాడు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని.. ఆయనతో ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇటీవల పవన్ తిరుపతిలో నిర్వహించిన జనసేన బహిరంగ సభపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఏకంగా పవన్ అంతటి నిజాయితీపరుడు ఏపీలో మరెవ్వరూ లేరని ఆకాశానికెత్తేశాడు. తీక్షణమైన అతని ఆలోచనా విధానమే ఆయన పవర్, ఆయన నిజాయితీనే ఆయన స్టార్ డమ్.. అంటూ కొనియాడాడు. 
 
ఇప్పుడిప్పుడే పవన్ కల్యాణ్ ప్రసంగం చూశాడు. అతను చెప్పిన విషయం చాలా బాగా అర్థమైంది. పవన్ ఎంచుకున్న మూడంచెల ఉద్యమ మార్గం ఉత్తమం. పవన్ తెలివిగా తీసుకున్న ఉద్యమ ప్రణాళిక అంత తొందరగా ఎవరికీ అర్థం కాకపోవచ్చు. పవన్ లాంటి నాయకుడు ఉండటం ఏపి ప్రజల అదృష్టం.. అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక రామ్ గోపాల్ ట్వీట్స్ చూసి పవన్ కల్యాణ్ షాక్ అయ్యారు. ఇంకా ఎప్పుడూ ఏకిపారేసే వర్మ పవర్ స్టార్‌పై ప్రశంసలు కురిపించడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments