Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయన, హన్సికలతో శింబు రొమాన్స్.. మార్చిలో ఇదు నమ్మ ఆళు రిలీజ్!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (15:06 IST)
కోలీవుడ్ ‌హీరో శింబు వివాదాలకు పెట్టింది పేరు. తన ప్రేమ వ్యవహారంలో కానీ.. సినీ వ్యవహారాల్లో కానీ వివాదాలుండక తప్పవు. ఇప్పటికే శింబు నటించిన ‘ఇదు నమ్మ ఆలు’ చిత్రం విడుదల కాకుండానే పలు వివాదాలను ఎదుర్కొంది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రానికి శింబు తండ్రి టి.రాజేందర్ నిర్మాతగా వ్యవహారించారు. గతంలో అందాల తార నయనతారతో చెట్టాపట్టాలేసుకుని శింబు ప్రేమ వ్యవహారం వల్లభ సినిమా నాటికి ముదిరి పాకాన పడింది.
 
ఆ సినిమాలో వీరిద్దరూ భార్యభర్తల్లా నటించారనేకంటే జీవించారనడం కరెక్ట్. పెళ్లి వరకూ వెళ్లే సమయంలో ఇద్దరికీ బెడిసికొట్టి చెరోదారి పట్టారు. ఆ తర్వాత హన్సికతో ప్రేమ చాప్టర్ మొదలైంది. ‘వాలు’ షూటింగ్ సమయంలో శింబు, హన్సిక ప్రేమలో పడ్డారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపే బ్రేకప్ కూడా అయ్యింది.  
 
శింబు చాలామంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించిన సంగతి జగమెరిగిన సత్యం. హన్సికతోనూ మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఈ నేపథ్యంలో తన ప్రియురాళ్లైన నయన, హన్సికలను ఒకే తెరపై కనిపించనున్నాడు. ఏమాయ చేశాడో ఏమో కానీ నయనతార, శింబు నటిస్తున్న ఇదు నమ్మ ఆళు సినిమాలో హన్సికను కూడా నటించేలా చేశాడు.

దర్శకుడు పాండిరాజ్ హన్సికను ఇదు నమ్మ ఆళులో నటించమని అడిగిన వెంటనే ఈ తెల్లపిల్ల కూడా నటించేందుకు ఓకే చెప్పేసింది. దీంతో పాండిరాజ్ దర్శకత్వంలో శింబు, నయనతార, హన్సికలు నటిస్తున్న ఇదు నమ్మ ఆళు సినిమా మార్చిలో రిలీజ్ కానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments