Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుంటూరోడు' టీజర్ రిలీజ్... సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న : మంచు మనోజ్

మంచు మనోజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన 'గుంటూరోడు' చిత్రం ప్రచార టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ఎస్‌.కె.సత్య దర్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2016 (22:43 IST)
మంచు మనోజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన 'గుంటూరోడు' చిత్రం ప్రచార టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ఎస్‌.కె.సత్య దర్శకత్వంలో శ్రీవరుణ్‌ అట్లూరి నిర్మిస్తున్నారు.
 
మంచు మనోజ్‌ మాట్లాడుతూ... సత్య ముందు నాకు లైన్‌ చెబుతానన్నాడు. లైన్‌ చెప్పగానే నాకు బాగా నచ్చింది. తర్వాత నాకు కథ చెప్పాడు. కమర్షియల్‌ సినిమా చేద్దామని తనే చెప్పాడు. గుంటూరోడు పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. ఇప్పటివరకు నేను చెప్పనటువంటి మాస్‌ డైలాగ్స్‌ కూడా ఈ సినిమాలో చెప్పాను. చక్కటి ప్రేమకథకు, మాస్‌ ఎలిమెంట్స్‌ మిక్స్‌ చేసి దర్శకుడు తెరకెక్కించాడు. అలాగే నిర్మాత వరుణ్‌ కావల్సిన వ్యక్తి. శ్రీవసంత్‌ మంచి సంగీతాన్నిచ్చారు. వెంకట్‌ మాస్టర్‌ నా కెరీర్‌ బెస్ట్‌ ఫైట్స్‌ను కంపోజ్‌ చేశారు. ఈ సినిమా కోసం నేను కూడా ఆతృతతో ఎదురుచూస్తున్నానని' అన్నారు.
 
దర్శకుడు ఎస్‌.కె.సత్య తెలుపుతూ.... మనోజ్‌ ప్రేమించి, నమ్మకంతో సినిమాకు చేసి త్వరగా పూర్తయ్యేలా సహకరించారు. హీరోయిన్‌తో ఉండే పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. త్వరలో విడుదలకాబోయే థియేట్రికల్‌ ట్రైలర్‌ ఇంకా బావుంటుంది. సినిమా అంతకన్నా బావుంటుంది. వసంత్‌గారు మంచి మ్యూజిక్‌ అందించారని అన్నారు.
 
నిర్మాత శ్రీవరుణ్‌ అట్లూరి మాట్లాడుతూ... దర్శకుడు సత్య, చాలా కాలంగా మంచి స్నేహితుడు. సత్య చెప్పిన పాయింట్‌ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యాను. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జనవరి చివర్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని' అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల లడ్డు: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో వైసిపి మోత

సూడో సెక్యులరిస్టులే పవన్‌ను విమర్శిస్తున్నారు : కె.నాగబాబు

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్షమాపణలు క్షమాపణలు చెప్పాలి..

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్?

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు- మారణకాండలో 107 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments