Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్పీ రేటింగ్‌ను కుమ్మేసిన గుంటూరు కారం..

సెల్వి
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (10:18 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టీవీల్లో మంచి రేటింగ్ కొట్టేసింది. ఇటీవల టీవీల్లో ప్రసారమైన గుంటూరు కారం సినిమా భారీగా 9.23 టీఆర్పీని నమోదు చేసింది. నెగిటివ్ టాక్, యావరేజ్ రివ్యూలు, డీసెంట్ బాక్సాఫీస్ కలెక్షన్లతో దెబ్బతిన్న ఈ సినిమాకు టీవీ రేటింగ్ కాస్త ఊరటనిచ్చింది.  
 
జెమిని ఛానెల్‌లో, వాల్తేర్ వీరయ్య, దసరా, హాయ్ నాన్న వంటి సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్‌లను ప్రసారం చేసినప్పుడు, టీఆర్పీలు వరుసగా 5.15, 4.99, 4.45గా నమోదైనాయి. హిట్ చిత్రాలకే టీఆర్పీ తక్కువ వచ్చిన నేపథ్యంలో.. మోస్తరుగా ఆడిన గుంటూరు కారం సినిమాకు ఏకంగా 9.23 టీఆర్పీ రేటింగ్ రావడం అందిరీనీ ఆశ్చర్యపరిచింది.  
 
హిట్ అయిన సినిమాలను ఇప్పటికే చాలా మంది థియేటర్‌లలో వీక్షించివుంటారు. కానీ గుంటూరు కారం సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేదు. దీంతో టీవీలో వేసే సరికి ఆ సినిమాను భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారని సినీ పండితులు అంటున్నారు.  
 
ఇకపోతే.. గుంటూరు కారం బాక్సాఫీస్ కలెక్షన్లను పక్కన పెడితే, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో TOP-10 జాబితాలో టాప్ 5 స్థానాల్లో ఒక వారం పాటు నిలిచింది. ఇప్పుడు టెలివిజన్‌లోనూ ఇదే తరహాలో అత్యధిక టీఆర్పీ సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments