Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాకుంత‌లం కోసం అడ‌వినే తెచ్చిన గుణ‌శేఖ‌ర్‌

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (07:54 IST)
Forest set, Hyd
శాకుంతల స‌మంతీయం పేరుతో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డిస్తూనే వున్నాడు. స‌మంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న విష‌యాన్ని కూడా తెలియ‌జేశాడు. అందుకోసం ఆమె త‌న ఆహార్యాన్ని కూడా మార్చుకుంది. దుష్యంతుల‌, శ‌కుంత‌ల చరిత్ర‌కు సంబంధించిన క‌థ కాబ‌ట్టి అందుకు సంబంధించిన దుస్తులు, కేళాలంక‌ర‌ణ‌లు చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిగిపోతున్నాయి. ఇందులో విశేషం ఏమంటే, దుష్యంతుడు, శ‌కుంత‌ల గాంధ‌ర్వ వివాహం చేసుకున్నాక‌, శాపం వ‌ల్ల మ‌ర్చిపోవ‌డం జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత ఓ ముని ఆశ్ర‌మంలో ఆశ్ర‌యం పొందుతుంది. ఆశ్ర‌మం అడ‌వి ప్రాంతంలో వుంటుంది కాబ‌ట్టి దీనికోసం ఏకంగా అడ‌విని ఏకంగా హైద‌రాబాద్‌కే తీసుకువ‌చ్చాడు ద‌ర్శ‌క నిర్మాత గుణ‌శేఖ‌ర్. అంటే ఏకంగా అడ‌వి సెట్‌ను అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో గ‌త కొద్దిరోజులు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్ యుద్ధ ప్రాతిప‌ద‌క‌పై వేసేస్తున్నారు.
 
ఈ అడ‌వి సెట్ అంత‌కముందు అంద‌రికీ తెలిసిన బిగ్ బాస్ షో. సెట్‌. దాన్ని పూర్తిగా లోప‌ల కూల్చేసి మొత్తంగా దాని రూపురేఖ‌లు మార్చేశారు. ఆశ్ర‌మంలో వుండాల్సిన చ‌క్క‌టి చెట్లు వాతావ‌ర‌ణ‌, లేళ్ళు, ఆశ్ర‌మ‌వాసులు జ‌ల‌పాతాలు, ప‌క్షులు ఇవ‌న్నీ అక్క‌డ ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా సెట్‌లో సాధ్య‌మేనా అని అనుమానం క‌లుగుతుంది. కానీ సినిమా వాళ్ళు త‌ల‌చుకుంటే ఏదైనా చేసేస్తారు. శ్రీ‌కారం సినిమాకు ఏకంగా 45 ఎక‌రాల స్త‌లానికి చిత్తూరులో తీసుకుని పంట‌లు పండించి సెట్ వేశారు. అంత‌కుముందు చార్మినార్ సెట్ను ఏకంగా వేరేచోట వేసేశారు. మ‌ధుర‌మీనాక్షి టెంపుల్ యాజ్‌టీజ్‌గా గండిపేట‌లో వేసేశారు. ఇలా చాలా వున్నాయి. అయితే ఈ అడ‌వి సెట్‌లో కీల‌క స‌న్నివేశాలు మాత్ర‌మే తీయ‌నున్నార‌ని తెలిసింది. లాంగ్‌షాట్‌లోఅడ‌వి నేప‌థ్యం అంతా హైద‌రాబాద్ శివార్ల‌లోని అడ‌విలో షూట్ చేసి వ‌స్తార‌ని స‌మాచారం. మ‌రి కొద్ది గంట‌ల్లో పూర్తి స‌మాచారం అంద‌నుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments