Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయకు జీఎస్టీ అధికారుల షాక్.. ఇప్పుడేమంటావ్..?

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (13:56 IST)
ప్రముఖ తెలుగు యాంకర్, సినీ నటి అనసూయకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. రూ.55 లక్షలు కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. సర్వీస్‌ ట్యాక్స్‌ కింద అనసూయ రూ. 80 లక్షలు బకాయి ఉన్నారు. అయితే, ఆమె కేవలం రూ.25 లక్షలు మాత్రమే కట్టారు. దీంతో, మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్‌‌కు చెందిన పలువురిపై జీఎస్టీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ వీరు ట్యాక్‌ ఎగ్గొడుతున్నారని అధికారులు తెలిపారు. 
 
ఇటీవల యాంకర్లు సుమ కనకాల, అనసూయ భరద్వాజ్, టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి ఇళ్లపై... జీఎస్టీ అధికారులు దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అంటూ యాంకర్లు అనసూయ, సుమ ఖండించారు. సుమ ప్రత్యేకంగా ఓ వీడియోనే పోస్టు చేసింది. అయితే అనసూయ మాత్రం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ ట్వీట్ చేసింది. 
 
తన ఇంటిలో ఎలాంటి జీఎస్టీ దాడులు జరగలదేని తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది. అనసూయ రెండు రోజుల క్రితం తన ఇంటిపై ఎలాంటి ఐటీ రైడ్స్ జరగలేదని.. మీడియా ఎక్కువ చేసిందని కాస్త ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అధికారులు తాజాగా అనసూయకు నోటీసులు ఇచ్చారు. జీఎస్టీ కట్టాలంటూ పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అనసూయను నెటిజన్స్, ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏమంటావ్ అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments