Webdunia - Bharat's app for daily news and videos

Install App

సి.ఎస్.ఆర్.ఆంజనేయులు మనవడు చిలకా ప్రొడక్షన్స్ తో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (18:23 IST)
Allu Aravind- Sarath Marar- Chilaka
మొదటి తరం నటులు సి.ఎస్.ఆర్.ఆంజనేయులు మనవడు రాజీవ్ చిలక తమ చిలకా ప్రొడక్షన్స్ తో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ  ఇచ్చారు.  వరల్డ్ యానిమేషన్ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సంస్థ గ్రీన్ గోల్డ్ గ్రూప్ ఇప్పుడు మరో కొత్త అడుగు వేసింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పేరుతో ఈ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యానర్ లోగోను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శరత్ మరార్ విడుదల చేశారు.
 
యానిమేషన్ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్.. కార్టూన్ నెట్ వర్క్, పోగో, డిస్నీ ఎక్స్‌డీల్లో బ్యాంగ్ విక్రమ్ బేతాల్, ది కృష్ణ, చోటా భీమ్ వంటి పలు ప్రోగ్రామ్స్‌తో మెప్పించింది.
 
2021లో గ్రీన్ గోల్డ్ విఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించి గాడ్ ఫాదర్, దసరా, బంగార్రాజు, చార్లి వంటి చిత్రాలకు వర్క్ చేసి ప్రశంసలు అందుకున్నారు. దీనికి కొనసాగింపుగా 2022లో గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ సంస్థను స్థాపించారు. తాజాగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. అందులో భాగంగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో లాంచింగ్ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. నిర్మాత  రాజీవ్ చిలక , ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత శరత్ మరార్, శ్రీనివాస చిలక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
 
నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ ‘‘లయన్ కింగ్ సినిమా చూసి ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు అనిపించింది. వరల్డ్ డిస్నీ నాకు ఎప్పుడూ ఓ ఇన్‌స్పిరేషన్. నేను యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ఇబ్బందులుండేవి. వాటన్నింటినీ అధిగమిస్తూ సిన్సియర్‌గా కష్టపడుతూ వచ్చాం. లయన్ కింగ్ లాంటి సినిమా చేయాలనే గోల్ తోనే గ్రీన్ గోల్డ్ సంస్థ స్టార్ట్ అయ్యింది. నాకంటే ముందు నాకు తెలిసిన స్నేహితులు చాలా మంది సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ కాలేక ఇంటికెళ్లిపోయారు. వీటన్నింటినీ గమనిస్తూ వచ్చాను. నాకు ఇరవై ఏళ్లు పట్టింది. ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇవీ కాకుండా ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి.  ఇండస్ట్రీలో అరవింద్ గారిలా కావాలని అనుకుంటున్నాను. అందరూ మా బ్యానర్‌కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  
 
శ్రీనివాస్ చిలక మాట్లాడుతూ ‘‘సీనియర్ నటులు సి.ఎస్.ఆర్.ఆంజనేయులుగారు మా పెద్దతాతగారు అవుతారు. ఆయన నాటక రంగంలోకి తనదైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి. మా తాతగారు నాగేశ్వరరావుగారు వాహిని స్టూడియోలో అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. గుణ సుందరి కథ, మల్లీశ్వరి, మాయాబజార్ వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు వర్క్ చేశారు. మా నాన్నగారు మధుసూదన్ డి.ఆర్.డి.ఓలో వర్క్ చేశారు. మేం ఇంనీరింగ్ చదువుకుని, యు.ఎస్‌లో సెటిలయ్యాం. ఓరోజు రాజీవ్ నాకు ఫోన్ చేసి జాబ్ వదిలేస్తున్నానని అన్నాడు. శానిఫ్రానిస్కోలో యానిమేషన్ నేర్చుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. గ్రీన్ గోల్డ్ సంస్థను స్టార్ట్ చేశాం. 2004లో కృష్ణ యానిమేషన్ సిరీస్‌ను స్టార్ట్ చేశాం. 2008లో చోటా భీమ్ స్టార్ట్ చేశాం. ఇండియన్ యానిమేషన్‌కే చోటా భీమ్ దారి చూపించింది. ఇప్పటికి 15 ఏళ్లు అవుతున్నా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 2012లో చోటా భీమ్‌ను థియేటర్‌లో రిలీజ్ చేశాం. టీవీ, థియేటర్లో రాజీవ్ డైరెక్ట్ చేస్తూ 116 యానిమేషన్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఈ జర్నీలో భాగంగా చిలకా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశాం’’ అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి కొత్త ప్రయోగం చేసే మనుషులను, బ్యానర్స్ ను పరిచయం చేయటం ఆనందంగా ఉంది. 2011 రాజీవ్ నన్ను కలిశాడు. 70 ఏళ్ల ముందు మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే కోరికతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోని వదిలేసి మద్రాస్ వచ్చేశాడు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్ ను అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానం. రాజీవ్ చేసిన చోటా భీమ్‌ని నేను తెలుగులో రిలీజ్ చేశాను. తర్వాత ఓరోజు పంజాగుట్టలో చూస్తే బెలూన్స్ పై కూడా చోటా భీమ్ బొమ్మలు చూసి ఎంత పాపులర్ అయ్యిందోనని ఆశ్చర్యపోయాను. రాజీవ్ చిన్నదిగా స్టార్ట్ చేసిన చోటా భీమ్ చాలా పాపులర్ అయ్యింది. తను సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. అతిశయోక్తి కాకపోతే రాజీవ్‌ను రాజమౌళితో పోల్చవచ్చు. ఎందుకంటే ఆయన దగ్గరున్న ఫ్యాషన్‌ని.. రాజీవ్ దగ్గర చూశాను. చిలకా ప్రొడక్షన్స్ ఎన్నో మంచి చిత్రాలను సాధించాలని కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments