Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 నుంచి గోపీచంద్ - తమన్నా 'సీటీమార్' షూటింగ్ ప్రారంభం

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (17:57 IST)
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `సీటీమార్‌`. పవన్‌ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‌లాక్డౌన్ వ‌ల్ల వాయిదాపడిన షూటింగ్‌ న‌వంబ‌ర్ 23 నుండి ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ, 'లాక్డౌన్‌కి ముందే రాజమండ్రి, హైదరాబాద్ ఆర్ఎఫ్‌సిలో‌ షూటింగ్ జ‌రిపి మూడు భారీ షెడ్యూల్స్‌లో 60 శాతం సినిమా పూర్తిచేశాం. ఈ నెల 23 నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. గోపీచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్, భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే భావోద్వేగభరిత కథాంశమిది.
 
ప్రతి సన్నివేశం హార్ట్‌ట‌చింగ్‌గా ఉంటుంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ బేన‌ర్‌లో సంపత్ నంది హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ‌ అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశారు. ఎంత‌గానో ఎదురు చూస్తున్న గోపిచంద్ అభిమానుల‌కోసం వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకొస్తాం అని చెప్పుకొచ్చారు. 
 
మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది మాట్లాడుతూ, లాంగ్ వార్మ‌ప్, సాలిడ్ స్ట్రెచెస్, ప‌వ‌ర్‌ప్యాక్డ్ ప్రాక్టీస్ త‌ర్వాత ఫిట్ అండ్ ఫ్యాబ్‌గా మా టీమ్ అంద‌రం అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల జాగ్రత్తల‌తో మాకు ఎంతో ఇష్టం అయిన సీటిమార్ షూటింగ్ ‌కోసం సిద్ద‌మయ్యాం. న‌వంబ‌ర్ 23 నుండి కూత మొదలు అన్నారు. 
 
ఈ సినిమాలో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీబ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్‌లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.
 
 ఈ చిత్రానికి..
 సినిమాటొగ్ర‌ఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌,
 సంగీతం: మణిశర్మ‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, 
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,
 సమర్పణ: పవన్‌ కుమార్‌,
 నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
 కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments