Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెకె రాధామోహన్ నిర్మాతగా గోపీచంద్ 31వ చిత్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (16:33 IST)
KK Radhamohan, Gopichand, A Harsha
హీరో గోపీచంద్ తన 31వ చిత్రం కన్నడ దర్శకుడు ఎ హర్షతో చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్  బ్యానర్ ఫై  కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పూజా కార్యక్రమం ఈరోజు చిత్ర యూనిట్ సమక్షంలో లాంఛనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. ''మా ప్రొడక్షన్ నంబర్ 14లో హీరో గోపీచంద్, దర్శకుడు హర్షతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది'' అన్నారు.
 
కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన హర్ష, భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. గోపీచంద్ ఇంతకు ముందు కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు చేసినప్పటికీ, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, ఇతర ఎలిమెంట్స్ తో కూడిన మాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.
 
ఈ చిత్రంలో కొంత మంది అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్. త్వరలో ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలను మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments