Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమా గా గోపీచంద్ - కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

Webdunia
బుధవారం, 19 జులై 2023 (18:12 IST)
Gopichand at shoot
గోపీచంద్, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా నిర్మాత కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా యూనిట్ ఈ చిత్రానికి సంబధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసింది. కాకినాడ, రాజానగరం, అద్దరిపేట బీచ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.   కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌లను అందించిన హర్ష ఈ భారీ బడ్జెట్ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'భీమా' రూపొందుతుంది.
 
ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకట్, డాక్టర్ రవివర్మ  యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments