Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీ, మిలాన్ లో గోపీచంద్, కావ్య థాపర్ పాటతో షూటింగ్ పూర్తి

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (16:35 IST)
gopinchan team at milan
గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 గా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ రూపొందుతోంది. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్‌ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో ప్రజెంట్ చేస్తున్నారు
 
భారీ బడ్జెట్‌తో లావిష్ గా రూపొందనున్న ఈ చిత్రం మిలాన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఇటలీ, మిలాన్ లోని  కొన్ని అద్భుతమైన లోకేషన్స్ లో హీరో గోపీచంద్, కావ్య థాపర్ పాటతో షూటింగ్ పూర్తి. ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ గ్రాండ్ సాంగ్ ని కూడా ఈ షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.
 
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యుత్తమ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
 
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు.  చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.  
 
తారాగణం: 'మాచో స్టార్' గోపీచంద్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత: వేణు దోనేపూడి
బ్యానర్: చిత్రాలయం స్టూడియోస్
స్క్రీన్ ప్లే: గోపీ మోహన్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments