Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దసరాకి గాడ్ ఫాదర్ డేట్ ఫిక్స్‌

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (12:45 IST)
Godfather date poster
ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి-సల్మాన్ ఖాన్‌ల మెగా మాస్ ప్రభంజనంతో ఇటీవ‌లే విడుద‌లైన మొదటి సింగిల్- థార్ మార్ థక్కర్ మార్ ప్రోమోకు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. కానీ పూర్తి వీడియోసాంగ్ సాంకేతిక కార‌ణావ‌ల్ల రాలేక‌పోయింది. దాంతో సినిమా విడుద‌ల‌పై కూడా కాస్త సందేహాలు సోష‌ల్ మీడియాలో వ్య‌క్తం అయ్యాయి. వాట‌న్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఈరోజు సోమ‌వారంనాడు చిత్ర యూనిట్ తాజా అప్‌డేట్‌ను ముందుంచుంది. 
 
మెగాస్టార్ చిరంజీవి త‌న గాడ్ ఫాద‌ర్ గురించి తాజా వివ‌రాలు ట్వీట్ చేశారు. దానితో అభిమానుల్లో ఉత్సాహం పొంగింది. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న ద‌స‌రానాడు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లను కలిసి తెరపై చూడడం కన్నుల పండుగలా వుంది. వీరిద్దరి మాస్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేసింది. ఒకే రకమైన దుస్తులు ధరించి ఇద్దరూ వెండితెర ఆరాధ్య దైవాలుగా అలరించారు. ఇద్దరూ బ్లాక్ షేడ్స్ వాడటం స్టైల్ ని మరింత పెంచింది.
 
థమన్ అద్భుతమైన మాస్ డ్యాన్స్ నంబర్‌ ని కంపోజ్ చేయగా, చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ మూమెంట్స్ మెగా మాస్ జాతర సృష్టించాయి. హుక్ స్టెప్ ఖచ్చితంగా మాస్‌ను అలరిస్తోంది. భారీ సెట్‌లో ప్రభుదేవా మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. శ్రేయా ఘోషల్ ఈ పాటని ఆలపించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సెప్టెంబర్ 15న పూర్తి పాటను విడుదల చేయనున్నారు.
 
మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సత్య దేవ్, సునీల్,  సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.గా వ్య‌వ‌హ‌రించారు. గాడ్ ఫాదర్ దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments