Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జరీ కాదు ట్రీట్మెంట్‌కు వెళ్ళా - మహా సముద్రం ట్రెండ్ సెట్టర్ సినిమా - హీరో సిద్దార్ధ్

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (19:18 IST)
Siddharth
`మహా సముద్రం క్లైమాక్స్ షూట్‌లో చిన్న గాయమైంది. దానికే అజయ్ భూపతి  సర్జరీ అని చెప్పేశాడు. దీంతో మా అమ్మానాన్నలు తెగ  కంగారు పడిపోయి.. ఫోన్లు  చేశారు. ఆ వెంటనే అజయ్ భూపతికి ఫోన్ చేసి అలా చెప్పావ్ ఏంటి? అని అడిగాను. మీరే కదా ట్రీట్మెంట్ అని చెప్పారు అని అన్నాడు. ట్రీట్మెంట్‌కు, సర్జరీకి చాలా తేడా ఉందని అన్నాను. చిన్న గాయం మాత్ర‌మే సర్జరీలాంటిదేమీ జరగలేదు` అని వివ‌రించాల్సివ‌చ్చింద‌ని హీరో సిద్దార్ధ్ తెలియ‌జేశారు.
 
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో అక్టోబర్ 14న రాబోతోన్న సినిమా ‘మహా సముద్రం’. దర్శకుడు అజయ్ భూపతి. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మించారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించారు. ప్రమోషన్స్‌లో భాగంగా  హీరో సిద్దార్థ్ హైద‌రాబాద్ వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో ముచ్చటించారు.
 
క‌థ విన్నాక ఏదైనా చ‌ర్చ పెట్టారా?
శర్వానంద్ అద్భుతమైన నటుడు. మేం ఇద్దరం కలిసి ఓ  సినిమా చేస్తున్నామంటే ఎవరికి తగిన కారణాలు వారికి ఉంటాయి. నేను, శర్వాతో ఒక్కసారి చర్చలు కూడా పెట్టుకోలేదు. మాకు  స్క్రిప్ట్ మీద అంత నమ్మకం ఉంది.
అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన‌ ఆర్ ఎక్స్ 100 సినిమాను నేను చూశాను. ఎంత పర్‌ఫెక్షన్‌తో తీశాడో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా తీసి, రామ్ గోపాల్ వర్మ శిష్యుడనిపించుకున్నాడు. అలాంటి దర్శకుడు వచ్చి రెండో  సినిమా కథ చెప్పాడు. అజయ్ భూపతి మహాసముద్రం కథ చెబితుంటే.. రెండో సినిమా దర్శకుడిలా అనిపించలేదు. వెంటనే ఓకే చెప్పాను. అలా శర్వా, నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక షూటింగ్ ప్రారంభిద్దామంటే కరోనా వ్యాప్తి మొద‌లైంది. కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ చేయడం కష్టమైంది. అలా షూటింగ్‌ను చాలా సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. మహా సముద్రం కథ నాకు నచ్చింది. ఇది ట్రెండ్ సెట్టర్ సినిమా. 
 
ఇందులో ర‌గ్గ్‌డ్ పాత్ర‌లోనూ క‌నిపిస్తున్నారే?
మేకప్ ఆర్టిస్ట్ శివ గారు నాతో ఎనిమిదేళ్లుగా ఉన్నారు. ఆయన వల్లే మహా సముద్రంలో ఆ మేకోవర్ వచ్చింది. ఇంత వరకు చూడని సిద్దార్థ్ కావాలని నేను, అజయ్ భూపతి కలిసి ఆయనకు చెప్పాం. నాకు అంత త్వరగా గడ్డం రాదు. ఉన్న గడ్డంతోనే శివ గారు నన్ను అలా రెడీ చేశారు. ట్రైలర్ చూసి అందరూ ఫోన్ చేసి మెచ్చుకున్నారు. రెండు పీరియడ్స్‌లో జరిగే కథ ఇది. క్యారెక్టర్లకు తెలియదు కానీ.. చూసే ప్రేక్షకులకు తెలుస్తుంది.
 
ట్రైల‌ర్ కొంద‌రికి అర్థంకాలేద‌నే కామెంట్ వ‌చ్చింది?
సినిమా విడుదలకు ముందు అందరూ ట్రైలర్‌ను కట్ చేస్తారు. ఇంత వరకు ఎవ్వరూ చేయని విధంగా ట్రైలర్‌ను కట్ చేయాలని అనుకుంటారు. కానీ సినిమాలోని  కథ ఏంటో మొత్తం చూపించేలానే కట్ చేస్తున్నారు. కానీ మా దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్ బాగుంది కానీ కథ ఏంటి అర్థం కావడం లేదు అని చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు. అదే మా సక్సెస్.
 
సినిమా చూశాక ఏమ‌నిపించింది?
మనం తీసుకున్న నిర్ణయాల వల్లే  పరిస్థితులు ఏర్పడతాయి. మంచి మనిషా? చెడ్డ మనిషా? అనేది వారు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడుతాయి. నేను సినిమా చూశాను. ఇందులో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది. మహా అనేది హీరోయిన్ పేరు. అది ఎవరు? అన్నది సినిమాలో తెలుస్తుంది. ఫీమేల్ క్యారెక్టర్స్ అద్భుతంగా రాశారు.
 
చాక్‌లెట్‌బాయ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారా?
ఇది కచ్చితంగా శర్వా చెప్పినట్టు షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఆ పాత్రలో నన్ను ఊహించుకున్నందుకు,  పాత్రను నాకు ఇచ్చినందుకు అజయ్ భూపతికి థ్యాంక్స్. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు  సిద్దు అంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనే ఇమేజ్ ఇచ్చారు. కానీ ఈ సినిమాతో కొత్త రకమైన ఇమేజ్ వస్తుంది.
 
Siddharth
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కోవిడ్ అని ట్వీట్ చేశారు?
ముంబై నుంచి వచ్చేటప్పుడు ఎయిర్ పోర్టులో జనం గుమిగూడారు. ఆ ఫోటోను తీసి మా మేకప్ మెన్‌కు పంపిస్తే నమ్మలేదు. రైల్వే స్టేషన్ ఫోటో తీసి ఎయిర్ పోర్ట్‌దని అంటారేంటి అన్నాడు. దాదాపు పది వేల మంది ఉన్నారు. కోవిడ్ గురించి ఒక్కరూ కూడా ఆలోచించలేదు. ఫ్లైట్ మిస్ అవుతుందని నాకు భయం పట్టుకుంది. కానీ చివరకు ఎలాగోలా దొరికింది. కానీ అక్కడ అలాంటి  పరిస్థితి ఎందుకు ఎదురైందంటే ఎవ్వరూ సమాధానం చెప్పరు. నవరాత్రి అని కొందరు, కంప్యూటర్లు ఫెయిల్ అయ్యాయని ఇంకొందరు అంటున్నారు.
 
మీరు బాయ్స్ నుంచి ఇప్ప‌టికే ఒకేలా వున్నారు. ర‌హ‌స్యం ఏమిటి?
2003లో బాయ్స్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. మధ్యలో వచ్చింది బ్రేక్‌లాంటిది కాదు. కానీ నాలో నేను వెతుక్కునే క్రమంలో బ్రేక్ వచ్చింది. అందరూ కాశీ, హిమాలయాలకు వెళ్తుంటారు. అలా నేను కూడా కాస్త గ్యాప్ ఇచ్చాను. నాకు నేను మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నన్ను స్టార్‌ను చేసింది తెలుగు వాళ్లే. అయితే ప్రతీ భాషల్లో నాకు ఓ ఐకానిక్ చిత్రం ఉంది.తమిళంలో బాయ్స్, హిందీలో రంగ్ దే బసంతి ఇలా ఉన్నాయి. అయితే నేను ప్రతీ చోటా తెలుగు నటుడిని అని చెప్పుకునేవాడిని. దాంతో అక్కడి వారు హర్ట్ అయ్యేవారు. కానీ నేను తెలుగు స్టార్‌ని, ఇండియన్ నటుడిని. అందుకే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను. చాలా సినిమాలు పూర్తయి ఉన్నాను.
 
రెండు సినిమాలు ఒకే సారి రావడం అంటే.. ఇద్దరు ఒకేసారికి గుడికి వెళ్లడం లాంటిది. కానీ ఎవరికి వరం ఇస్తారో మనం చెప్పలేం. నా పేరు తెరపై చూడాలని నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. అలా అందరి పేర్లు రావాలి. అందరూ బాగుండాలి.
 
నాకు ఇది కచ్చితంగా కమ్ బ్యాక్ సినిమా అవుతుంది. నేను, శర్వా ఓ  పది, పన్నెండేళ్ల క్రితం ఓ రెండు మూడు  సార్లు మాట్లాడుకుని ఉంటాం. అయితే అతను అప్పుడప్పుడే ఎదుగుతున్న స్టార్. ఈ సినిమా ఎందుకు ఆడుతుంది? ఎందుకు ఆడటం లేదు? అంటూ రకరకాల ప్రశ్నలు అడిగేవాడు. ఈ ఎనిమిదేళ్ల గ్యాప్‌లో శర్వా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు. మంచి సందేశాత్మక చిత్రాలను తీస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఒత్తిడి అంతా కూడా శర్వాకు ఇచ్చాను. నేను హాయిగా ఉన్నాను.
 
- సినిమాలో హీరోయిన్లతో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో మాకు తెలీదు. కానీ శర్వాకు నాకు మధ్య ఉన్న కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎవ్వరికీ ఏం అర్థం కాకుండా ఉండేందుకు అజయ్ భూపతి పాటలను, ట్రైలర్‌లను అలా కట్ చేస్తున్నాడు.
 
- మహా సముద్రం సింగిల్ థియేటర్ సినిమా. రంగ్ దే బసంతి విడుదలైనప్పుడు హిట్ అవ్వలేదని అన్నారు. కానీ ఆ ఏడాది హయ్యస్ట్ కలెక్షన్లను సాధించింది. కొంత మంది దర్శకులు ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తారు. కొంత మంది దర్శకులు మాస్ సినిమాలు తీసి ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటారు. హ్యూమన్ ఎమోషన్స్ డ్రామాతోనే ఈ సినిమా ఉంటుంది. ఫ్యూచర్‌లో ప్రతీ ఒక్కరికీ ఇలాంటి మల్టీస్టారర్ కథలు హీరోల దగ్గరకు వెళ్తాయని అనిపిస్తోంది.
 
నిర్మాణరంగం ఎలా వుంది?
నేను బయటి నుంచి వచ్చాను. అలా బయటి నుంచి వచ్చిన వారి కోసం నేను ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. కొత్త వారిని ఎంకరేజ్ చేద్దామని అనుకున్నాను. తెలుగులో కూడా కొంత మంది యంగ్ దర్శకులతో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాను.
 
టాక్స్ గురించి కామెంట్ చేశారు?
2002 నుంచి కూడా నేను పన్నులు కట్టడంలొ ఎంతో పారదర్శకంగా ఉంటాను. ప్రతీ ఒక్కటీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాను. ఎంబీఏ చదివి మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను. శంకర్ గారి సినిమాతో హీరో అయ్యాను. అయితే నేను సంపాదించిన వాటిల్లోంచి నిర్మించాను. నేను నిర్మించిన ప్రతీ ఒక్కటి కూడా లాభాలను తెచ్చిపెట్టింది. అలా ప్రాఫిట్ రాకపోతే మా నాన్న కూడా ఊరుకోరు.
 
 ప్రతీ సినిమాకు రీసెర్చ్ ఉంటుంది. వైజాగ్‌లో చాలా టైం గడిపాను. అక్కడ ఎంతో మందిని కలిశాను. ఫుడ్ అంటే చాలా ఇష్టం. అక్కడ నేను టేస్ట్ చేయని ఫుడ్ ఉండదు. నాకు మానిటర్ చూడటం ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు అందరూ మానిటర్ చూసి సలహా ఇస్తున్నారు. కానీ నేను మాత్రం అజయ్ భూపతిని చూస్తుంటాను. కానీ హీరోయిన్స్ కొంచెం చేసినా సూపర్ అంటాడు. నేను, శర్వా ఎంత చేసినా కూడా ఓకే అంటాడు(న‌వ్వుతూ)
 
ఇది థియేట్రికల్ బ్లాక్ బస్టర్ చిత్రం. అది చెప్పడానికే ఎంతో బాగుంది. ఇప్పుడు తెలుగులోనేరుగా రెండు ప్రాజెక్ట్‌లున్నాయి. ఈ ట్రైలర్ చూసిన తరువాత యంగ్ డైరెక్టర్లు కూడా ఫోన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments