Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

దేవీ
సోమవారం, 14 జులై 2025 (17:44 IST)
Glimpses release from K-Ramp
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. "K-ర్యాంప్" మూవీ దీపావళి పండుగ సందర్భంగా  అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
ఈ రోజు " K-ర్యాంప్"  సినిమా నుంచి 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించారు. చిల్ కావడంలో అతనికి పోటీ లేదు. ఈ క్యారెక్టర్ ను ఫుల్ ఎనర్జీతో పర్ ఫార్మ్ చేశారు కిరణ్ అబ్బవరం. ఈ గ్లింప్స్ చివరలో 'మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ చూస్తే " K-ర్యాంప్" తో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అని తెలుస్తోంది.
 నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments