Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గని' నుంచి ఫస్ట్ పంచ్ వీడియో రిలీజ్.. డిసెంబర్ 3న వచ్చేస్తోంది.. (video)

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (19:45 IST)
మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. తాజాగా సినిమా నుంచి ఫస్ట్ పంచ్‌ను విడుదల చేశారు. 
 
బాక్సింగ్ రింగ్‌లో ఉన్న వరుణ్ తేజ్ లుక్ ను రివీల్ చేస్తూ.. ఆయన ఇచ్చిన పంచ్‌తో చిన్న వీడియో కట్ చేశారు. ఈ పంచ్ మాములుగా లేదు. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీని కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్‌ను రంగంలోకి దించారు.  
 
ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించడం కోసం స్పెషల్  ట్రైనింగ్ తీసుకున్నాడు. జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్ చేసి పెర్ఫెక్ట్ ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలానే ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ముందుగా జూలై నెలాఖరున విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ పంచ్ వీడియోతో అధికారికంగా అనౌన్స్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments