Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీ హిల్స్ ఫ్లై ఓవర్ కోసం జీహెచ్ఎంసీ ప్లాన్.. బాలయ్య ఇంటిని కూల్చేయక తప్పదా?

హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలకృష్ణ ఇంటికి కొత్త చిక్కు వచ్చిపడింది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త ప్రణాళికల

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (15:57 IST)
హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలకృష్ణ ఇంటికి కొత్త చిక్కు వచ్చిపడింది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో 20మల్టీ లెవల్ ఫ్రై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలను తయారు చేసింది. ఇందులో భాగంగా జూబ్లీ హిల్స్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం బాలయ్య ఇంటికి కూల్చే ఛాన్సున్నట్లు సమాచారం. ఫైఓవర్ల పనులు ప్రారంభమైతే, మొత్తం 581 నిర్మాణాలను కూల్చివేయాల్సి ఉంటుందని.. ఈ కూల్చివేత నిర్మాణాల్లో ప్రముఖుల నివాసాలు, రెస్టారెంట్లున్నాయని తెలుస్తోంది
 
కాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు మీదుగా రెండు ఫ్లై ఓవర్లు వెళ్లనుండగా, అందులో ఒకటి అప్రోచ్ ఫ్లయ్ ఓవర్ డిజైన్ సరిగ్గా బాలయ్య ఇల్లు ఉన్న ప్రాంతం నుంచి వెళ్లనుంది. ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, వాటి నిర్మాణం చేపడితే.. దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ కట్టించుకుని, ఆపై బాలకృష్ణకు ఇచ్చిన ఇంటిని కూల్చివేయక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. 2019 చివరికి ఎస్ఆర్డీపీని పూర్తి చేయాలని.. ఇందుకోసం రూ.2,631 కోట్లు ఖర్చవుతుందని జీహెచ్‌ఎంసీ అంచనా వేస్తోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments