Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (09:06 IST)
సినీ దిగ్గజ నేపథ్యగాయకుడు, దివంగత ఘంటసాల వేంకటేశ్వర రావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. ఆయన గురువారం తెల్లవారుజామున నగంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర సీమల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన... ఇటీవల కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు. రెండు రోజల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా తేలడం గమనార్హం. అయితే, ఆయన అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషయమించడంతో తుదిశ్వాస విడిచారు. 
 
రత్నకుమార్ మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. రత్నకుమార్‌కు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
 
డబ్బంగ్ ఆర్టిస్టుగా రత్నకుమార్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు. 
 
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటివరకు ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ సహా 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments