Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సర్‌గా పాత్రలో వరుణ్ తేజ్ : కొత్త చిత్రం టైటిల్ 'గని'

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (11:56 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మంగళవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త నటించే కొత్త చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న చిత్రం పేరు గని. 
 
ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ కెరీర్‌లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్‌‌, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. 
 
వ‌రుణ్ తేజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో వ‌రుణ్ లుక్ మూవీపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. గ‌ని అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ ప్రత్యేకంగా అమెరికాలో శిక్షణ పొందారు.
 
కాగా, టాలీవుడ్‌లోకి 'ముకుంద' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన క‌థ‌లను ఎంపిక చేసుకుంటూ మంచి విజ‌యాలు అందుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో "ఎఫ్ 2", "గ‌ద్ద‌లకొండ గ‌ణేష్" చిత్రాల‌తో భారీ విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

ఇద్దరమ్మాయిలతో ఒక్కడు kissik... రోడ్డు మీద ఏంట్రా సిగ్గులేదా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments